Paris Jackson: తండ్రి ఆస్తిలో రూ.600 మిలియన్లు ఇవ్వాలంటూ కోర్టుకెక్కిన పారిస్ జాక్సన్
ఈ వార్తాకథనం ఏంటి
పాప్ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మైఖేల్ జాక్సన్ మరణించి 17 ఏళ్లు కావస్తోంది. తన ముగ్గురు పిల్లల కోసం ఆయన ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. అయితే,ఆ ట్రస్టుకు రావాల్సిన ఆదాయం అందడం లేదని ఆయన కుమార్తె పారిస్ జాక్సన్ ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మైఖేల్ జాక్సన్ ఎస్టేట్ నుంచి సుమారు 600 మిలియన్ డాలర్లను కుటుంబ ట్రస్టుకు బదిలీ చేయాలని కోరుతూ పారిస్ జాక్సన్ లాస్ ఏంజిల్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. మైఖేల్ జాక్సన్ సంగీత హక్కుల ఒప్పందాలు,ఆస్తుల విక్రయాల ద్వారా ఎస్టేట్‌కు భారీగా ఆదాయం వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ ఆదాయంలో కుటుంబ ట్రస్టుకు ఎలాంటి వాటా అందడం లేదని ఆరోపించారు.
వివరాలు
పారిస్ జాక్సన్ అభ్యర్థనను తిరస్కరించిన ఎస్టేట్ నిర్వాహకులు
అందువల్ల ఎస్టేట్ ఆదాయంలో 600 మిలియన్ డాలర్లను ట్రస్టుకు బదిలీ చేయాలని కోర్టును కోరారు.
అయితే,ఎస్టేట్ నిర్వాహకులు మాత్రం పారిస్ జాక్సన్ అభ్యర్థనను తిరస్కరించారు.
ఈ వ్యవహారంలో అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని,అవి పరిష్కారమయ్యే వరకు ట్రస్టుకు డబ్బులు బదిలీ చేయలేమని స్పష్టం చేశారు.
మైఖేల్ జాక్సన్ 2009 జూన్‌లో 50ఏళ్ల వయసులో మరణించారు. ఆయనకు ప్రిన్స్,పారిస్, బిగి అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతం పారిస్ జాక్సన్ వయసు 28 ఏళ్లు. ట్రస్టు నిబంధనల ప్రకారం పిల్లలు 21 ఏళ్ల వయసు దాటిన తర్వాత దాని ఆదాయంలో ఒక్కొక్కరికి వాటా అందాల్సి ఉంటుంది.
అయితే, వయసు దాటినా ట్రస్టు నుంచి తమకు రావాల్సిన డబ్బులు అందడం లేదని పిల్లలు ఆరోపిస్తున్నట్లు సమాచారం.