Page Loader
Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం
Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం

Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం

వ్రాసిన వారు Stalin
Feb 11, 2024
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితి గందరగోళంగా మారింది. మొత్తం 265జాతీయ అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం 257స్థానాలకు మాత్రమే ఫలితాలను ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ మద్దతుతో స్వతంత్రులుగా పోటీ చేసిన 102మంది గెలుపొందారు. నవాజ్ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 73స్థానాల్లో విజయం సాధించింది. బిలావల్ భుట్టో చెందిన పీపీపీ 54స్థానాలను కైవసం చేసుకుంది. నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. వీరికి పాకిస్థాన్ ఆర్మీ కూడా మద్దతుగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

పాకిస్థాన్

దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారుల నిరసన

పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇంకా తుది ఫలితాలను ప్రకటించలేదు. ఎన్నికల సంఘ తీరుపై ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీపీ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్ నిలబెట్టిన కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. పోలింగ్ రోజున ఓటింగ్ మెటీరియల్‌ను లాక్కోవడం, డ్యామేజ్ చేయడం వంటి ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి వచ్చాయి. ఈ ఫిర్యాదులను ధృవీకరించిన ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15న పలు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. పాక్ ఎన్నికల్లో ఎన్నికలలో రిగ్గింగ్‌పై అమెరికా, యూకే, ఈయూ ఆందోళన వ్యక్తం చేశాయి.