పురావస్తు తవ్వకాల్లో లభ్యమైన మూడు వేల ఏళ్ళ క్రితం నాటి ఖడ్గం: మెరుపు చూసి ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
పురావస్తు శాఖ జరిపే తవ్వకాల్లో అనేక వస్తువుకు బయటపడతాయి. వాటిలో కొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాగే చరిత్ర మీద ఆసక్తిని కలగజేస్తాయి. మనసులో కుతూహలాన్ని పెంచుతాయి.
తాజాగా జర్మనీలో జరిపిన తవ్వకాల్లో 3వేల ఏళ్ళ క్రితం నాటి ఖడ్గం బయటపడింది. ఈ ఖడ్గం, కాంస్యయుగానికి చెందినదనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జర్మనీలోని చారిత్రాత్మక స్మారక చిహ్నాలను సంరక్షించే బేవెరియన్ స్టేట్ ఆఫీసు తెలియజేసిన వివరాల ప్రకారం, క్రీస్తు పూర్వం 14వ శతాబ్దానికి చెందిన ఖడ్గమని, కాంస్య యుగం మధ్య కాలంలో ఈ ఖడ్గాన్ని తయారు చేసి ఉంటారని అంటున్నారు.
జర్మనీలోని నార్డ్ లింజెన్ అనే నగరంలో గత వారం క్రితం జరిపిన తవ్వకాల్లో ఈ ఖడ్గం బయటపడింది.
Details
తళతళా మెరుస్తున్న ఖడ్గం
ఈ ఖడ్గాన్ని అష్టభుజి ఖడ్గంగా గుర్తించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ ఖడ్గాన్ని ఎక్కడ నుండైతే తవ్వి తీసారో ఆ ప్రాంతంలో ఒక పురుషుడు, స్త్రీ, టీనేజ్ బాలుడి సమాధులు ఉన్నాయట.
అయితే ఆ ముగ్గురికీ సంబంధా ఉందా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి మరింత పరిశోధన చేయాల్సి ఉంటుందని బేవెరియన్ స్టేట్ అధికార్లు తెలియజేసారు.
3వేల ఏళ్ళ క్రితం నాటి ఖడ్గమైనా కూడా ఇప్పటికీ తళతళా మెరుస్తుండడంతో, ఈ కత్తిని సంప్రదాయంలో భాగంగా పాతి పెట్టి ఉంటారేమోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా ఇలాంటి ఖడ్గం లభించడం చాలా అరుదు అని, వీటిని సంరక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని బేవెరియన్ స్టేట్ ఆఫీస్ వెల్లడి చేసింది.