Page Loader
హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు 
హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు

హైస్కూల్ పార్టీలో కాల్పులు; 9మంది యువకులకు గాయాలు 

వ్రాసిన వారు Stalin
Apr 24, 2023
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెక్సాస్‌లోని జాస్పర్‌లో జరిగిన ప్రోమ్ పార్టీలో కాల్పుల కలకలం రేగింది. ఈఘటనలో 9మంది యువకులు గాయపడ్డారు. బాధితులను గాయాల పరిస్థితిని బట్టి రెండు ఆసుపత్రులకు తరలించారు. అయితే అందరూ సాధారణ గాయాలతోనే బయటపడ్డారని జాస్పర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం వెల్లడించింది. ఈ కాల్పులపై విచారణ కొనసాగుతోందని పేర్కొంది. టెక్సాస్‌ బాధితుల్లో 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్నట్లు స్థానిక మీడియా సంస్థ నివేదించింది. ఈ నేరస్తులకు శిక్ష వేయడానికి పోలీసులకు పూర్తి సహకారాన్ని అందజేస్తామని జాస్పర్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టెక్సాస్‌లోని స్కూల్‌లో కాల్పులు