LOADING...
Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం

Nepal: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ సతీమణి కన్నుమూత; మోదీ సంతాపం

వ్రాసిన వారు Stalin
Jul 12, 2023
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ సతీమణి సీతా దహల్ (69) బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఖాట్మండులోని ప్రైవేట్ ఆసుపత్రి అధికారులు తెలిపారు. సీతా దహల్ అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ ప్రోగ్రెసివ్ సూప్రాన్యూక్లియర్ పాల్సీ (పీఎస్పీ)తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి ప్రకటించింది. ప్రోగ్రెసివ్ సూపర్‌న్యూక్లియర్ పాల్సీ అనేది అరుదైన మెదడు సంబంధిత వ్యాధి. ఈ రుగ్మత ఆలోచన, శరీర కదలికలను నియంత్రించే మెదడులోని నరాల కణాలను దెబ్బతీస్తుంది. పీఎస్పీ వ్యాధికి సరైన వైద్యం లేదు.

నేపాల్

సీతా దహల్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

గతేడాది అక్టోబర్‌లో సీతా దహల్ ఆరోగ్యం క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చారు. తదుపరి చికిత్స కోసం భారత్‌తో పాటు నేపాల్‌లోని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. వైద్య నిపుణుల ప్రకారం, పీఎస్పీ అనేది ఒక అరుదైన వ్యాధి. ఇది ప్రతి లక్ష జనాభాలో 5-6 మందిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్‌ సతీమణి సీతా దహల్ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సీతా దహల్ మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని పుష్ప కమల్ దహల్‌‌కు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీ చేసిన ట్వీట్