Page Loader
పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి 
పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి

పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం; ముగ్గురు మృతి 

వ్రాసిన వారు Stalin
Jun 01, 2023
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

తూర్పు పెన్సిల్వేనియాలోని ఓ ఇంటి బయట తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఈ కాల్పుల్లో 33ఏళ్ల వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో మరణించిన వారిని 19 ఏళ్ల జాషువా లుగో పెరెజ్, 8 ఏళ్ల జీసస్ పెరెజ్ సలోమ్, 9ఏళ్ల సెబాస్టియన్ పెరెజ్ సలోమ్‌గా గుర్తించారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఒకరిని లక్ష్యంగా చేసుకొని ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోందని లెబనాన్ పోలీసు విభాగానికి చెందిన చీఫ్ బ్రెట్ ఫిషర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మృతుల్లో  ఇద్దరు మైనర్లు