Heatwaves in Europe: 43 డిగ్రీలే అయినా భారత్‌తో పోలిస్తే ఐరోపాలో వేసవి తీవ్రత ఎందుకు ఎక్కువ?
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఐరోపా దేశాలను తీవ్ర ఎండలు అతలాకుతలం చేస్తున్నాయి. బయట అడుగుపెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. వడదెబ్బలు,అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జర్మనీ,స్లోవేకియా,పోలండ్ వంటి దేశాల్లో 41 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన దేశంలో కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి కాబట్టి ఇందులో ప్రత్యేకత ఏమిటనే సందేహం రావచ్చు. అయితే భారత్‌లో 43 డిగ్రీలు,ఐరోపాలో 43 డిగ్రీల ప్రభావం ఒకేలా ఉండదు. ప్రస్తుతం ఐరోపా ఖండంలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అక్కడి చరిత్రలోనే అత్యధిక స్థాయిలకు చేరుతున్నాయి. ఈ వేడి ప్రభావం తాజాగా బాల్కన్స్ ప్రాంతం,ఉక్రెయిన్ వైపు విస్తరిస్తోంది.
వివరాలు
భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం
బెల్‌గ్రేడ్,బుకారెస్ట్ నగరాల్లో 37 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, స్లోవేకియాలో 40.5 డిగ్రీలు, జర్మనీలో 41.7 డిగ్రీల వరకు చేరాయి. ఎండలకు తోడు వడగాలులు వీచడంతో జూన్ 21 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్రాన్స్‌లోనే దాదాపు వెయ్యి మంది మరణించినట్లు సమాచారం.
ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత తీవ్రత అక్కడి భౌగోళిక పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
దీనితో పాటు గాలిలో తేమ శాతం,ఇళ్ల నిర్మాణ విధానం,పట్టణాల వాతావరణ లక్షణాలు కూడా ప్రభావం చూపుతాయి.
భారత్‌తో పోలిస్తే ఐరోపాలో సూర్యకిరణాలు భూమిపై పడే విధానం భిన్నంగా ఉంటుంది.
మన దేశంలో సూర్యకిరణాలు దాదాపు నేరుగా భూమిపై పడుతుంటే, ఐరోపాలో అవి ఒక కోణంలో భూమిని తాకుతాయి.
వివరాలు
రోజుకు 15 నుంచి 17 గంటల వరకు పగటిపూటే..
అలాగే వేసవికాలంలో అక్కడ పగటి సమయం ఎక్కువగా ఉండటం వల్ల వేడి ప్రభావం చాలా గంటల పాటు కొనసాగుతుంది.
సూర్యకిరణాల కోణం, సూర్యుడి స్థానంలో వచ్చే మార్పులు కూడా వేడి తీవ్రతను పెంచే అంశాలుగా చెప్పొచ్చు.
ఐరోపాలోని అనేక నగరాల్లో రోజుకు 15 నుంచి 17 గంటల వరకు పగటిపూటే ఉంటుంది.
దీంతో భవనాలు, రహదారులు, పేవ్‌మెంట్లు ఎక్కువసేపు సౌరశక్తిని గ్రహించి నిల్వ చేసుకుంటాయి. ఫలితంగా రాత్రి వరకు వేడి తగ్గకుండా ఉంటుంది.
ఇక భారత్‌లో సూర్యకిరణాలు ఎక్కువ ఎత్తు నుంచి పడినా, పగటి సమయం ఐరోపాతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.
అయితే మన దేశంలో సౌర వికిరణం తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది.
వివరాలు
ఇళ్ల నిర్మాణ శైలి కూడా ప్రభావం చూపుతోంది
ఐరోపాలో ఇళ్లను ప్రధానంగా చలిని తట్టుకునేలా, లోపల వేడి నిల్వ ఉండేలా నిర్మిస్తారు.
దీనికి విరుద్ధంగా భారత్‌లో ఇళ్లను చల్లదనాన్ని కాపాడే విధంగా నిర్మించే సంప్రదాయం ఉంది.
అంతేకాకుండా ఐరోపాలో చాలా ఇళ్లలో ఫ్యాన్లు కూడా ఉండవు. గతంలో అక్కడ ఎక్కువగా హీటర్లనే ఉపయోగించేవారు.
అయితే ఇటీవల సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో అనేక మంది తమ ఇళ్లలో ఎయిర్ కండీషనర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
వివరాలు
వాతావరణానికి అలవాటు పడే విధానంలో తేడా
వాతావరణానికి మన శరీరం అలవాటు పడే విధానం కూడా దేశానికో దేశం భిన్నంగా ఉంటుంది.
భారత్‌లో అనేక ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతుంటాయి.
అందువల్ల ఇక్కడి ప్రజలు అలాంటి వేడిని కొంతవరకు తట్టుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు.
అయితే ఐరోపాలో చలికాలం అయినా, వేసవికాలం అయినా వాతావరణ మార్పులు ఒక్కసారిగా తీవ్రంగా కనిపిస్తాయి.
అక్కడ అధిక ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవడం వల్ల ప్రజల శరీరాలు వెంటనే అలాంటి పరిస్థితులకు అలవాటు పడలేవు.
ఉష్ణ మండల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వేడి పెరిగినప్పుడు త్వరగా చెమట పడుతుంది.
దీని ద్వారా శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంతో పాటు హృదయనాళాల వ్యవస్థ కూడా వేడికి తగినట్లుగా త్వరగా స్పందిస్తుంది.
వివరాలు
గాలిలో తేమ కూడా కీలకమే
కానీ ఐరోపాలో ఈ అనువర్తన సామర్థ్యం తక్కువగా ఉండటంతో వేడి ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తుంది.
ఒకే ఉష్ణోగ్రత ఉన్నా గాలిలో తేమ శాతం కారణంగా వేడి అనుభూతి మారిపోతుంది.
భారత్‌లో వేసవికాలం,రుతుపవనాల సమయంలో గాలిలో తేమ అధికంగా ఉంటుంది.
దీంతో చెమట త్వరగా ఆవిరి కాకపోవడం వల్ల వేడి ఎక్కువగా అనిపిస్తుంది. అయితే ఇక్కడి ప్రజలు అలాంటి పరిస్థితులకు అలవాటు పడిపోయారు.
భారత్‌లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండటంతో సూర్యకిరణాల తీవ్రత కొంత మేర తగ్గుతుంది.
కానీ ఐరోపాలో కాలుష్యం తక్కువగా ఉండటంతో సూర్యరశ్మి నేరుగా శరీరంపై పడుతూ వేడి ప్రభావాన్ని మరింత పెంచుతుంది.
వివరాలు
గాలిలో తేమ కూడా కీలకమే
అలాగే ఐరోపాలో వడగాడ్పుల సమయంలో గాలి చాలా తక్కువగా వీచడం లేదా పూర్తిగా నిలిచిపోవడం జరుగుతుంది.
దీనివల్ల వేడి ఎక్కువసేపు నిలిచిపోతుంది. భారత్‌లో మాత్రం వడగాడ్పులు సాధారణంగా వేడి, పొడి గాలులతో కలిసి వీచడం వల్ల పరిస్థితులు కొంత భిన్నంగా ఉంటాయి.