Ukraine: ఉక్రెయిన్ ప్రధాని రాజీనామా.. ప్రభుత్వంలో కీలక మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ ప్రధాన మంత్రి యులియా స్విరిడెన్‌కో ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రభుత్వంలో కీలక మార్పులు చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన స్విరిడెన్‌కో, దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వానికి నాయకత్వం వహించే అవకాశం లభించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.
వివరాలు
తదుపరి చర్యలపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చ
తదుపరి చర్యలపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చించినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఆ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు లేదా భవిష్యత్ బాధ్యతల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, స్విరిడెన్‌కో రాజీనామాను జెలెన్‌స్కీ కూడా సామాజిక మాధ్యమాల్లో ధ్రువీకరించారు. ఉక్రెయిన్ ప్రస్తుతం తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందని ఆయన పేర్కొంటూ, ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని సంకేతాలు ఇచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉక్రెయిన్ ప్రధాని పదవికి స్విరిడెన్‌కో గుడ్‌బై
🗣️ Ukrainian Prime Minister Yulia Svyrydenko confirms she is stepping down after President Volodymyr Zelenskyy announced plans for a government reshuffle https://t.co/S1zI1DaBq5 pic.twitter.com/jeBGY4sZiX
— Anadolu English (@anadoluagency) July 12, 2026