LOADING...
Zelenskyy: ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు? జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు
ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు? జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు

Zelenskyy: ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు? జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రష్యా ఇంటెలిజెన్స్‌ సహకారం అందిస్తున్నట్టు పేర్కొంటూ, దీనికి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని జెలెన్‌స్కీ ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జెలెన్‌స్కీ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఇరాన్ ప్రభుత్వానికి రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు

'ఇరాన్ ప్రభుత్వానికి రష్యా ఇంటెలిజెన్స్ మద్దతు ఇస్తోంది. ఈ విషయం మా వద్ద ఉన్న ఆధారాలతో స్పష్టమైంది. ఇది ప్రమాదకర పరిణామం. వెంటనే ఈ చర్యలను ఆపాలి. లేకపోతే పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంది' అని జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనేక దేశాలు ఈ సంక్షోభాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. యుద్ధ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ప్రతికూలంగా మారుతున్నాయని, కొన్ని దేశాల్లో ఇంధన సరఫరా వ్యవస్థలో కూడా అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం నిలదొక్కుకునేందుకు, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయడానికి రష్యా సహాయం అందించడం సరైంది కాదని ఆయన విమర్శించారు.

Advertisement

వివరాలు 

ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు

ఈ పరిస్థితుల వల్ల యుద్ధం మరింత కాలం కొనసాగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు అందిస్తోందన్న వార్తలు యుద్ధం ప్రారంభం నుంచే పలు అంతర్జాతీయ మీడియాల్లో వెలువడుతున్నాయి. మాస్కో సహకారంతోనే అమెరికా యుద్ధ విమానాలు, నౌకలు, సైనిక స్థావరాలపై ఇరాన్ కచ్చితమైన దాడులు చేయగలుగుతోందని ఆ కథనాలు సూచించాయి. ఇప్పుడు జెలెన్‌స్కీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

వివరాలు 

ఈ ఆరోపణలపై స్పందించని రష్యా,ఇరాన్

అయితే, ఈ ఆరోపణలపై ఇప్పటివరకు రష్యా లేదా ఇరాన్ అధికారులు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరాన్‌లోని బుషెహర్ అణుకేంద్రం సహా కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు అనుచితమని లావ్రోవ్ వ్యాఖ్యానించారు.

Advertisement