LOADING...
Zuckerberg: రూ.1,415 కోట్ల మెగా డీల్.. ఫ్లోరిడాలో జుకర్‌బర్గ్ సంచలనం
రూ.1,415 కోట్ల మెగా డీల్.. ఫ్లోరిడాలో జుకర్‌బర్గ్ సంచలనం

Zuckerberg: రూ.1,415 కోట్ల మెగా డీల్.. ఫ్లోరిడాలో జుకర్‌బర్గ్ సంచలనం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్(Mark Zuckerberg) ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ చర్చకు దారితీశారు. మియామిలో అత్యంత ఖరీదైన, కట్టుదిట్టమైన భద్రత కలిగిన 'Indian Creek Island'లో ఆయన 170 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,415 కోట్లు) వెచ్చించి ఓ లగ్జరీ భవనాన్ని సొంతం చేసుకున్నారు. మియామి-డేడ్ కౌంటీ చరిత్రలోనే ఇది అత్యధిక విలువ కలిగిన గృహ కొనుగోలుగా నమోదు కావడం విశేషం. 'బిలియనీర్ బంకర్'గా పేరుపొందిన ఈ ద్వీపంలో ప్రస్తుతం ఆ భవనం నిర్మాణంలో ఉంది. మొత్తం 1.84 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా మాన్షన్‌లో 9 బెడ్‌రూమ్‌లు, 11 బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

వివరాలు 

జెఫ్ బెజోస్, టామ్ బ్రాడీల సరసన చేరిన మెటా అధినేత

సముద్ర తీరాన్ని ఆనుకుని ఉండే వాటర్‌ఫ్రంట్ స్విమ్మింగ్ పూల్, వ్యక్తిగత పడవల కోసం ప్రైవేట్ డాక్ కూడా ఉండనున్నాయి. అదనంగా అత్యాధునిక సదుపాయాలతో జిమ్, ప్రత్యేక హెయిర్ సెలూన్ నిర్మిస్తున్నారు. లైబ్రరీలో రహస్య మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం ఈ నివాసానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ద్వీపంలో మొత్తం 40 ఇళ్లకే అనుమతి ఉంది. అక్కడ నివసించే వారి భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బలగం పనిచేస్తోంది. ఇప్పటికే అమెజాన్ వ్యవస్థాపకుడు Jeff Bezos ఇక్కడ రెండు గృహాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు జుకర్‌బర్గ్ కూడా ఆయనకు సమీపంలోనే నివాసం ఏర్పరుచుకుంటున్నారు.

వివరాలు 

ఈ ఏడాది చివరి నాటికి కొత్త ఇంట్లోకి మారే అవకాశం!

కాలిఫోర్నియాలో బిలియనీర్లపై అదనంగా 5 శాతం పన్ను విధించే ప్రతిపాదన ముందుకు రావడంతో, జుకర్‌బర్గ్, బెజోస్ వంటి టెక్ ప్రముఖులు తక్కువ పన్నులున్న ఫ్లోరిడా వైపు మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది. 2026 చివరి నాటికి జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌(Priscilla Chan)తో కలిసి ఈ కొత్త నివాసంలోకి ప్రవేశించే అవకాశమున్నట్లు సమాచారం.

Advertisement