
భారతీయ మార్కెట్లోకి స్కోడా కోడియాక్ వచ్చేసింది, ధర, ప్రత్యేకతలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
భద్రత విషయంలో టాప్ లో ఉన్న స్కోడా ఆటో ఇండియా, తాజాగా కోడియాక్ కారును భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది.
5స్టార్ రేటింగ్ ఉన్న ఈ కారు, 4*4సెగ్మెంట్ కు చెందినది. 7సీటర్ ఫీఛర్ గల ఈ కారులో స్టైల్ డీఎస్జీ, స్పోర్ట్ లైన్ డీఎస్జీ, ఎల్ అండ్ కే అనే వేరియంట్లు లభిస్తున్నాయి.
స్టైల్ వేరియంట్ ధర - 37.99లక్షలు
స్పోర్ట్ లైన్ - 39.39లక్షలు
ఎల్ అండ్ కే - 41.39లక్షలుగా ఉంది.
ప్రతీ మూడు నెలకు ఒకసారి 750యూనిట్లను అమ్మాలని స్కోడా ఆటో ఇండియా నిర్ణయం తీసుకుంది. ఈ కారు ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ చూద్దాం.
Details
2023 స్కోడా కోడియాక్ కారు ఫీఛర్లు
7.8సెకన్లలో 0కి.మీ నుండి 100కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అంతకుముందు మోడల్స్ కంటే మరింత ఎక్కువగా మైలేజ్ ఇస్తుంది.
కంఫర్ట్, ఈకో, నార్మల్, ఇండివిడ్యువల్, స్నో, స్పోర్ట్ మొదలగు ఆరు రకాల డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.
డోర్ ఎడ్జ్ ప్రొటెక్టర్స్ ఉండడంతో పాటు వెనకాల సీట్లో కూర్చునే వారికి అదనపు స్పేస్ లభిస్తుంది. వెనక సీటు వారికి హెడ్ రెస్ట్ ఉంటుంది. బీఎస్ 6 ఫేస్ 2 ఇంజన్ ను కలిగి ఉంది.
ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పనోరమా సన్ రూఫ్, 9ఎయిర్ బ్యాగ్స్, 360డిగ్రీ కెమెరా, 8అంగుళాల టచ్ స్క్రీన్, వైర్ లెస్ కనెక్షన్, 12స్పీకర్లు ఉన్నాయి.