Page Loader
లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు
2024 వోక్స్‌వ్యాగన్ ID.3కి మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సపోర్ట్ ఉంది

లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 01, 2023
06:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మన్ ఆటోమోటివ్ తయారీసంస్థ వోక్స్‌వ్యాగన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం ఎలక్ట్రిక్ కార్ ID.3 2024 అప్డేట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పూర్తిగా మార్పు కాకుండా కొద్దిగా ఫేస్‌లిఫ్ట్‌ పొందింది. అప్డేట్ వెర్షన్ లో 58kWh, 77kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. "డీజిల్‌గేట్" తర్వాత, వోక్స్‌వ్యాగన్ కి సంబంధించిన వరకు అత్యంత ముఖ్యమైన మోడల్‌లలో ID.3 ఒకటి.ఈ ఎలక్ట్రిక్ వాహనం ID సిరీస్ వాహనాలకు మార్గం సుగమం చేసింది. 2017లో వచ్చినప్పటి నుండి, ఈ కారు వివిధ గ్లోబల్ మార్కెట్లలో మాస్-మార్కెట్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో ముందంజలో ఉంది. ఇప్పుడు దాని ఆకర్షణను పెంచడానికి చిన్న డిజైన్ రిఫ్రెష్‌ను పరిచయం చేసింది.

కార్

2024 వోక్స్‌వ్యాగన్ ID.3కి వెనుక-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సపోర్ట్ ఉంది

2024 వోక్స్‌వ్యాగన్ ID.3కి వెనుక-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ సపోర్ట్ ఉంది, ఇది 58kWh లేదా 77kWh బ్యాటరీ ప్యాక్‌తో కనెక్ట్ అయింది. ఎలక్ట్రిక్ వాహనం 58kWhపై 426 కి.మీ వరకు 77kWhలో 546 కి.మీల పరిధి వరకు ప్రయాణిస్తుంది. 2024 వోక్స్‌వ్యాగన్ ID.3 లోపల విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌, మినిమలిస్ట్ డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్ డిజైన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్‌ తో వస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ ఉంటుంది. ఎంత ఖర్చవుతుంది? 2024 ID.3 ధరకు సంబంధించిన వివరాలను 2023 చివరిలో వోక్స్‌వ్యాగన్ తన లాంచ్ ఈవెంట్‌లో వెల్లడిస్తుంది. UKలో £39,425 ఉంటుంది(సుమారు రూ. 39.22 లక్షలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది).