2025 Triumph Speed Twin 900: భారతదేశంలో లాంచ్ అయ్యిన 2025 ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900.. ధర ఎంతో తెలుసా?
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో అప్‌డేట్ చేసిన స్పీడ్ ట్విన్ 900 బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 8.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 2025 మోడల్‌లో రిఫ్రెష్డ్ డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఛాసిస్ వంటి పలు మార్పులను పొందింది. ఈ మోడల్ 900సీసీ బోన్నెవిల్లే ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉంది.ఇది 7,500ఆర్‌పీఎమ్ వద్ద 65పీఎస్ పవర్, 3,800ఆర్‌పీఎమ్ వద్ద 80ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోడ్, రెయిన్ వంటి రెండు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉండటం వల్ల ఈ బైక్ వివిధ ఉపరితల పరిస్థితులకు అనుగుణంగా ప్రదర్శన అందిస్తుంది. కొత్త లీన్-సెన్సిటివ్ ఏబీఎస్,ట్రాక్షన్ కంట్రోల్ సాంకేతికత మెరుగైన నియంత్రణను అందిస్తుంది.ఈ బైక్‌లో 12 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉంది.
విశాలమైన లెగ్‌రూమ్
అప్‌డేట్ చేసిన స్పీడ్ ట్విన్ 900 మోడల్ మార్జోచి అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు, స్పోర్టీ ఫ్రంట్ మడ్‌గార్డ్, ఫోర్క్ ప్రొటెక్టర్‌లతో వస్తుంది. బ్యాక్ సైడ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, పిగ్గీబ్యాక్ బ్యాక్ సస్పెన్షన్ యూనిట్‌లు ఉన్నాయి. ఇరుకైన బ్యాక్ ఫ్రేమ్, స్లీక్ మడ్‌గార్డ్, కాంపాక్ట్ టెయిల్ లైట్‌తో ఇంటిగ్రేట్ చేయబడింది. బ్రేకింగ్ సిస్టమ్ 320ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్, 4-పిస్టన్ కాలిపర్‌తో అప్‌గ్రేడ్ చేయబడింది, ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది. బెంచ్ సీటు కొత్తగా డిజైన్ చేయబడింది, ఇది మరింత సన్నగా ఉండటంతో రైడర్‌కు కోనల్లో మెరుగైన సపోర్టును అందిస్తుంది. అదనంగా, విశాలమైన లెగ్‌రూమ్‌ను కలిగి ఉండటం ద్వారా మరింత సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది.
మూడు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో..
స్లిమ్ డీఆర్ఎల్ హెడ్‌లైట్‌తో కూడిన ఆల్-ఎల్ఈడీ లైటింగ్ సెటప్ బైక్‌కు అధిక విజిబిలిటీని అందిస్తుంది. టీఎఫ్టీ డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ మాడ్యూల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు ఫోన్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్‌ను సులభతరం చేస్తుంది. యూఎస్‌బీ-సి పోర్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆధునిక సదుపాయాలు ఈ మోడల్‌లో పొందవచ్చు. కొత్త స్పీడ్ ట్విన్ 900 మూడు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్యూర్ వైట్, గోల్డ్ హైలైట్‌లతో ఫాంటమ్ బ్లాక్, రెడ్ అవుట్‌లైన్‌తో అల్యూమినియం సిల్వర్. ట్రయంఫ్ వినియోగదారులకు కస్టమైజేషన్ కోసం వైడ్ రేంజ్ అప్లియన్సెస్‌ను కూడా అందిస్తోంది.