LOADING...
Isuzu D-Max V-Cross: డిజైన్ మారింది.. ఫీచర్లు పెరిగాయి.. 2026 ఇసుజు వీ-క్రాస్ న్యూ వెర్షన్ రిలీజ్!
2026 ఇసుజు వీ-క్రాస్ న్యూ వెర్షన్ రిలీజ్!

Isuzu D-Max V-Cross: డిజైన్ మారింది.. ఫీచర్లు పెరిగాయి.. 2026 ఇసుజు వీ-క్రాస్ న్యూ వెర్షన్ రిలీజ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మార్కెట్లో 2026 ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్ లాంచ్ అయింది.ప్రారంభ ధర రూ.25.50 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. డిజైన్, ఫీచర్లు, మెకానికల్ అప్‌డేట్స్‌తో ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది ఇసుజు. ఇకపై ఈ లైఫ్‌స్టైల్ పిక్-అప్ పూర్తిగా 4x4 డ్రైవ్‌ట్రైన్‌తోనే అందుబాటులో ఉంటుంది. 4x2 వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసింది. ఎక్స్‌షోరూమ్ ధరలు రూ.25.50 లక్షల నుంచి రూ.30.28 లక్షల వరకు ఉన్నాయి. టయోటా హైలక్స్‌కు గట్టి పోటీగా ఈ మోడల్ నిలవనుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇదే 1.9 లీటర్ డీజిల్ ఇంజిన్ కొనసాగుతోంది. ఇది 161 బీహెచ్‌పీ పవర్, 360 ఎన్‌ఎం టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

వివరాలు 

18 అంగుళాల అలాయ్ వీల్స్

ముఖ్యంగా అన్ని వేరియంట్లలో ఇప్పుడు 4WD స్టాండర్డ్‌గా ఇవ్వడంతో పాటు ఆటో-లాకింగ్ డిఫరెన్షియల్ జోడించడం ద్వారా ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచింది కంపెనీ. బయట లుక్స్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, ముందు భాగంలో బోల్డ్ గ్రిల్, బ్లాక్ ఫినిష్ లోయర్ లిప్ ఇచ్చారు. బంపర్ డిజైన్ మార్చి ఫాక్స్ స్కిడ్ ప్లేట్ తొలగించారు. కొత్తగా 18 అంగుళాల అలాయ్ వీల్స్ ఇచ్చారు. సైడ్ క్లాడింగ్ తగ్గించి క్లీన్ లుక్ తీసుకొచ్చారు. లోపల మాత్రం టెక్నాలజీ పరంగా పెద్ద అప్‌గ్రేడ్ కనిపిస్తోంది. పాత 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్థానంలో ఇప్పుడు 10.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇచ్చారు.

వివరాలు 

భద్రత పరంగా 360 డిగ్రీ కెమెరా

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉంది. డాష్‌బోర్డ్, డోర్లపై కాంట్రాస్ట్ ట్రిమ్ ఇన్సర్ట్స్ ఇచ్చి ప్రీమియం ఫీల్ తీసుకొచ్చారు. టాప్ వేరియంట్ Z ప్రెస్టీజ్‌లో రూఫ్ మౌంటెడ్ 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ కూడా ఉంది. భద్రత పరంగా 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు జోడించారు. మొత్తం మూడు వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంది. వీ-క్రాస్ 4WD MT Z, వీ-క్రాస్ 4WD MT Z ప్రెస్టీజ్, వీ-క్రాస్ 4WD AT Z ప్రెస్టీజ్. మొత్తంగా మరింత పవర్, ఆఫ్-రోడ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లతో 2026 వీ-క్రాస్ ఇప్పుడు ప్రీమియం లైఫ్‌స్టైల్ పిక్-అప్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Advertisement