Loading...
Maruti Suzuki Brezza: 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మైలేజ్ వివరాలు విడుదల.. 
2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మైలేజ్ వివరాలు విడుదల..

Maruti Suzuki Brezza: 2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మైలేజ్ వివరాలు విడుదల.. 

వ్రాసిన వారు Moogati Shabari
Jul 25, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కేవలం కొత్త డిజైన్, అదనపు ఫీచర్లతో మాత్రమే కాకుండా, విస్తృతమైన ఇంజిన్ ఎంపికలతో కూడా మార్కెట్లోకి వచ్చింది. ఈసారి కంపెనీ కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టడంతో పాటు, ఇప్పటికే ఉన్న సాధారణ పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లను కూడా కొనసాగించింది. దీంతో పనితీరు కోరుకునే వారికి, తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకునే వారికి వేర్వేరు ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా, ప్రతి వేరియంట్‌కు సంబంధించిన అధికారిక మైలేజ్ గణాంకాలు కూడా విడుదలయ్యాయి.

వివరాలు

టర్బో-పెట్రోల్ వేరియంట్ల మైలేజ్

కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను బ్రెజ్జాలోని పలు వేరియంట్లలో అందిస్తున్నారు.

అయితే, వేరియంట్‌ను బట్టి ఇంధన సామర్థ్యంలో స్వల్ప తేడా కనిపిస్తోంది.

LXi Turbo, VXi Turbo వేరియంట్లు లీటరుకు 20.47 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని కంపెనీ ప్రకటించింది.

ZXi Turbo, ZXi+ Turbo వేరియంట్ల అధికారిక మైలేజ్ 19.96 కిలోమీటర్లు/లీటర్గా పేర్కొంది.

ఈ రెండు విభాగాల మధ్య తేడా చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, టర్బో ఇంజిన్‌తో పాటు మెరుగైన ఇంధన పొదుపును కోరుకునే వినియోగదారులకు LXi, VXi టర్బో వేరియంట్లు ఆకర్షణీయమైన ఎంపికగా నిలవొచ్చు.

వివరాలు

మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ల మైలేజ్

సాధారణ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఎంచుకునే వారికి కూడా బ్రెజ్జా మంచి మైలేజ్‌ను అందిస్తోంది.

LXi MT, VXi MT వేరియంట్లు లీటరుకు 21.09 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయని కంపెనీ వెల్లడించింది.

ఇవే బ్రెజ్జా పెట్రోల్ శ్రేణిలో అత్యధిక మైలేజ్ ఇచ్చే వేరియంట్లుగా నిలిచాయి. మరోవైపు ZXi MT వేరియంట్ అధికారికంగా 20.81 కిలోమీటర్లు/లీటర్ మైలేజ్‌ను అందిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

ఆటోమేటిక్ వేరియంట్ల మైలేజ్

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యాన్ని కోరుకునే వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న VXi AT, ZXi AT, ZXi+ AT వేరియంట్లు లీటరుకు 20.17 కిలోమీటర్ల అధికారిక మైలేజ్‌ను నమోదు చేశాయి.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మధ్య మైలేజ్ పరంగా పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు.

ఇంధన పొదుపు విషయంలో సీఎన్‌జీ వేరియంట్లు మరోసారి ముందంజలో నిలిచాయి.

LXi CNG, VXi CNG, ZXi CNG మాన్యువల్ వేరియంట్లు కిలో సీఎన్‌జీకి 26.90 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయని కంపెనీ ప్రకటించింది.

ప్రతి నెలా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి తక్కువ నిర్వహణ ఖర్చుతో సీఎన్‌జీ వేరియంట్ మరింత అనుకూలమైన ఎంపికగా ఉండే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

వాస్తవ మైలేజ్ పరిస్థితులను బట్టి మారొచ్చు..

కంపెనీ వెల్లడించిన ఈ గణాంకాలు అధికారిక పరీక్షల ఆధారంగా ప్రకటించిన మైలేజ్ మాత్రమే.

వాస్తవ వినియోగంలో ట్రాఫిక్ పరిస్థితులు, డ్రైవింగ్ శైలి, రోడ్ల పరిస్థితి, వాహనంలో ఉన్న లోడ్ వంటి అంశాలపై ఆధారపడి మైలేజ్ మారే అవకాశం ఉంటుంది.

అయితే, విడుదలైన గణాంకాలను పరిశీలిస్తే టర్బో ఇంజిన్ వచ్చినప్పటికీ ఇంధన సామర్థ్యంలో పెద్దగా తగ్గుదల కనిపించలేదని చెప్పొచ్చు.

మరోవైపు, గరిష్ట మైలేజ్‌కే ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులకు మాత్రం సాధారణ పెట్రోల్ మాన్యువల్, సీఎన్‌జీ వేరియంట్లు ఇప్పటికీ ఉత్తమ ఎంపికలుగానే నిలుస్తున్నాయి.

ADVERTISEMENT