Loading...
Ford: ఆఫ్‌రోడ్‌ లవర్స్‌ కోసం ఫోర్డ్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. మాక్‌-ఈ ట్రైల్
ఆఫ్‌రోడ్‌ లవర్స్‌ కోసం ఫోర్డ్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. మాక్‌-ఈ ట్రైల్

Ford: ఆఫ్‌రోడ్‌ లవర్స్‌ కోసం ఫోర్డ్‌ కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. మాక్‌-ఈ ట్రైల్

వ్రాసిన వారు Balachander Sharma
Oct 23, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలను ఇష్టపడే ఎలక్ట్రిక్‌ కారు వినియోగదారుల కోసం ఫోర్డ్‌ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. తన మస్టాంగ్‌ మాక్‌-ఈ శ్రేణిలో 2027 మాక్‌-ఈ ట్రైల్‌ వేరియంట్‌ను చేర్చింది. ఇది AWD సెలెక్ట్‌ మోడల్‌ ఆధారంగా రూపొందింది. బేస్‌ సెలెక్ట్‌, మధ్యస్థాయి ప్రీమియం వేరియంట్ల మధ్య స్థానం పొందిన ఈ కారు.. ర్యాలీ మోడల్‌లోని కొన్ని ఆఫ్‌రోడ్‌ ఫీచర్లను అందిస్తోంది.

Details

ఆఫ్‌రోడ్‌ ప్రయాణాలకు ప్రత్యేక మార్పులు

మాక్‌-ఈ ట్రైల్‌లో స్టీరింగ్‌ ర్యాక్‌ను మార్చడంతో పాటు, సస్పెన్షన్‌ను ప్రత్యేకంగా ట్యూన్‌ చేశారు. కొత్త వీల్స్‌తోపాటు మిచెలిన్‌ క్రాస్‌క్లైమేట్‌ 2 టైర్లను అందించారు.

పెరిగిన గ్రౌండ్‌ క్లియరెన్స్‌ వల్ల కంకర రోడ్లు, చిన్న ఎత్తుపల్లాలపై ప్రయాణం కొంత సులభం కానుంది. ఇందులో 400 వాట్ల ఫోర్డ్‌ ప్రోపవర్‌ ఆన్‌బోర్డ్‌ వ్యవస్థను కూడా ప్రామాణికంగా ఇచ్చారు.

అయితే, శక్తి విషయంలో ట్రైల్‌ మోడల్‌ ర్యాలీ కంటే తక్కువే. ట్రైల్‌ 370 హెచ్‌పీ పవర్‌, 678 ఎన్ఎం టార్క్‌ అందిస్తుండగా.. ర్యాలీ వేరియంట్‌ 480 హెచ్‌పీ, 949 ఎన్ఎం టార్క్‌తో వస్తుంది.

Details

ధరలోనూ తక్కువే

అమెరికాలో మాక్‌-ఈ ట్రైల్‌ ప్రారంభ ధర 47,335 డాలర్లు. టాప్‌ వేరియంట్‌ ర్యాలీ ధర సుమారు 57,335 డాలర్లు.

అంటే ర్యాలీతో పోలిస్తే ట్రైల్‌ ధర దాదాపు 10,000 డాలర్లు తక్కువ. మిగతా 2027 మాక్‌-ఈ శ్రేణిలో RWD సెలెక్ట్‌ ధర 42,040 డాలర్లు కాగా, ప్రీమియం RWD, సెలెక్ట్‌ eAWD ధరలు 45,050 డాలర్లుగా ఉన్నాయి.

ADVERTISEMENT

Details

బ్యాటరీ, టెక్నాలజీలో మార్పులు

2027 మాక్‌-ఈలో ఫోర్డ్‌ కొత్త ఫ్రంట్‌ డ్రైవ్‌ యూనిట్‌ను పరిచయం చేసింది. ఉత్పత్తి ఖర్చు తగ్గించేలా రూపొందించిన ఈ యూనిట్‌ సామర్థ్యం మాత్రం గత మోడళ్లతో సమానంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. సెలెక్ట్‌, ప్రీమియం వేరియంట్లలో 73kWh బ్యాటరీ స్థానంలో 88kWh బ్యాటరీని అందిస్తున్నారు. దీనివల్ల ధర పెరిగినా, డ్రైవింగ్‌ రేంజ్‌ మెరుగుపడనుంది. ఫోర్డ్‌ బ్లూక్రూజ్‌ 1.5 సెమీ ఆటోనమస్‌ డ్రైవింగ్‌ వ్యవస్థను కూడా ఎంపికగా అందిస్తోంది. అయితే, భవిష్యత్తులో ఈ ఫీచర్‌ కావాలనుకునే వారు కొనుగోలు సమయంలోనే సంబంధిత హార్డ్‌వేర్‌ ఉన్న కారును ఎంచుకోవాలి. తర్వాత అదనంగా అమర్చే అవకాశం లేదని ఫోర్డ్‌ స్పష్టం చేసింది.

ADVERTISEMENT