
MG Windsor EV Pro: సింగిల్ ఛార్జ్‌తో 449 కిమీ.. ఎంజీ విండ్సర్ EV ప్రో లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లోకి కొత్త కారు MG విండ్సర్ EV ప్రోను అధికారికంగా విడుదల చేసింది.
అద్భుతమైన ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ, అధిక మైలేజ్‌తో ఈ ఎలక్ట్రిక్ వాహనం వినియోగదారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది.
బ్యాటరీ, రేంజ్ వివరాలు
ఈ వాహనంలో 52.9 kWh సామర్థ్యం గల లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. కంపెనీ ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 449 కి.మీ వరకూ ప్రయాణించగలదు.
ఇది వేగంగా ఛార్జ్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. వాహనానికి అమర్చిన మోటార్ ద్వారా అధిక టార్క్ మరియు శక్తిని పొందవచ్చు.
Details
అదనపు ఫీచర్లు
డ్యూయల్ టోన్ ఇంటీరియర్
V2L (వెహికల్ టూ లోడ్), V2V (వెహికల్ టూ వెహికల్) టెక్నాలజీలు
యాంబియంట్ లైటింగ్
ఇన్ఫినిటీ గ్లాస్ రూఫ్
ఫ్రంట్ సీట్స్ వెంటిలేషన్
15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో
4 స్పీకర్లు + 4 ట్వీటర్లు + సబ్ వూఫర్
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
604 లీటర్ల భారీ బూట్ స్పేస్
LED హెడ్‌లైట్లు, DRLs, టెయిల్ లైట్లు
19 అంగుళాల అల్లాయ్ వీల్స్
ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, గ్లాస్ యాంటెన్నా
పవర్డ్ టెయిల్‌గేట్ వంటి టాప్ నాచ్ ఫీచర్లు ఉన్నాయి.
Details
భద్రతా ప్రమాణాలు
ఈ వాహనంలో లెవల్ 2 ADAS, ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ వంటి సురక్షిత ఫీచర్లు సమకూర్చారు.
ధరలు, బుకింగ్స్
వాహనాన్ని BaaS (Battery-as-a-Service) మోడల్‌లో కూడా అందిస్తున్నారు.
బ్యాటరీ లేని వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర: ₹12.50 లక్షలు
బ్యాటరీతో కూడిన వెర్షన్ ఎక్స్-షోరూమ్ ధర: ₹17.49 లక్షలు ఈ కారుకు బుకింగ్స్ మే 8, 2025 నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ ప్రకటించింది.