Upcoming E-SUV Launch : 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న మహీంద్రా బీఈ 6ఇ, ఎక్స్ఈవీ 9ఇ మోడల్స్!
ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడళ్లను పరిచయం చేసింది. తాజాగా, మహీంద్రా తన ఎలక్ట్రిక్ ఆరిజిన్ ఎస్‌యూవీ - బీఈ 6ఇ, ఎక్స్ఈవీ 9ఇ మోడళ్లను టీజర్ రూపంలో విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు నవంబర్ 26, 2024న లాంచ్ కానున్నాయని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించింది. లాంచ్ ఈవెంట్‌లో వీటి ధరలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మహీంద్రా టీజర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ 'సాటిలేని పనితీరు, మిస్సబుల్ డిజైన్' అని పేర్కొంది. ఈ మోడల్‌లు మహీంద్రా ఎలక్ట్రిక్ గ్లోబల్ ప్రీమియర్‌లో ఆరంభం అవుతాయని కంపెనీ స్పష్టం చేసింది.
టాటా కర్వ్ వంటి మోడళ్లతో పోటీ
ఈ ఎస్‌యూవీ రెండు చివర్లలో కనెక్ట్ అయ్యే ఎల్ఈడీ లైటింగ్ సెటప్‌తో పాటు, ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్, డీఆర్ఎల్, మరియు ఆకట్టుకునే అల్లాయ్ వీల్స్‌తో వస్తుందని పేర్కొంది. ఎక్స్‌యూవీ 9ఇ 4740 ఎమ్ఎం పొడవు, 1900 ఎమ్ఎం వెడల్పు, 1760 ఎమ్ఎం ఎత్తు, 2775 ఎమ్ఎం వీల్‌బేస్‌తో ఉండనున్నట్లు తెలిసింది. ఈ కార్ 60kWh నుండి 80kWh వరకు బ్యాటరీ ప్యాక్‌లతో రానున్నట్లు సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 500కి.మీ. రేంజ్‌ను అందించగలదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లో టాటా కర్వ్ వంటి మోడళ్లతో పోటీపడేలా కనిపిస్తోంది.