Toyota Urban Cruiser Ebella: 543 కి.మీ రేంజ్ ఈవీ.. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వేరియంట్లు, ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టయోటా భారత మార్కెట్‌లోకి తన తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవలే అధికారికంగా రివీల్ చేసిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పేరు 'టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'. ఇది మారుతీ సుజుకీ ఈ-విటారాకు రీబ్యాడ్జ్ వెర్షన్‌గా రూపొందింది. మరో కొన్ని వారాల్లో అధికారిక లాంచ్‌కు సిద్ధమవుతున్న ఈ ఈవీ కోసం టయోటా ఇప్పటికే బుకింగ్స్‌ను ప్రారంభించింది. కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ1, ఈ2, ఈ3 అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
Details
తన
వేరియంట్లు, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను బట్టి దీని ధర రూ.19లక్షల నుంచి రూ.24లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. ఈ మోడల్‌కు టయోటా ఎనిమిదేళ్ల బ్యాటరీ వారంటీ, 60 శాతం బైబ్యాక్ అస్యూరెన్స్, అలాగే 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్' ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తామని స్పష్టం చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వారికి అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్స్, వేరియంట్ల ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.
Details
కలర్ ఆప్షన్స్
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా మొత్తం తొమ్మిది రంగుల్లో లభిస్తుంది. ఇందులో ఐదు మోనోటోన్ షేడ్స్, నాలుగు డ్యూయల్-టోన్ షేడ్స్ ఉన్నాయి. మోనోటోన్ రంగులు స్పోర్టిన్ రెడ్, కేఫ్ వైట్, ఎంటైసింగ్ సిల్వర్, గేమింగ్ గ్రే, బ్లూయిష్ బ్లాక్ డ్యూయల్-టోన్ రంగులు స్పోర్టిన్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, కేఫ్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, ఎంటైసింగ్ సిల్వర్ విత్ బ్లాక్ రూఫ్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ విత్ బ్లాక్ రూఫ్ వేరియంట్లు - ఫీచర్లు ఈ1 వేరియంట్ ఎక్స్‌టీరియర్ రూఫ్-ఎండ్ స్పాయిలర్, బాడీ సైడ్ మౌల్డింగ్, 18-ఇంచ్ అలాయ్ వీల్స్, హై-మౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండో వైపర్-వాషర్
Details
ఇంటీరియర్
10.25-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్-సైజ్ స్పేర్ వీల్, కప్ హోల్డర్‌తో సెంటర్ కన్సోల్, సెంటర్ లోయర్ బాక్స్, గ్లోవ్‌బాక్స్ డాంపర్, స్నో మోడ్, డ్రైవ్ మోడ్, వన్-పెడల్ మోడ్ స్విచ్‌లు, టిల్ట్-టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ లెదర్ స్టీరింగ్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, ఫ్యాబ్రిక్ సీట్లు, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, 40:20:40 స్ప్లిట్ రియర్ సీట్లు, స్లైడింగ్-రెక్లైనింగ్ రెండో వరుస సీట్లు, రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, బూట్ ల్యాంప్, యాంబియంట్ లైటింగ్, సింగిల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, పీఎం 2.5 ఫిల్టర్, కీ-లెస్ ఎంట్రీ, స్టార్ట్-స్టాప్ సిస్టమ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, ఎలక్ట్రికల్ ఓఆర్‌వీఎంలు, ఆటోమేటిక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, డెమిస్టర్
Details
సేఫ్టీ
ఫ్రంట్-రియర్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌పీ, ఈపీబీ, హిల్ హోల్డ్ కంట్రోల్, టీపీఎంఎస్, సీట్‌బెల్ట్ రిమైండర్లు, ఇమ్మొబిలైజర్, అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్, పెడల్ రిలీజ్ సిస్టమ్, లో బ్యాటరీ వార్నింగ్ సిస్టమ్ పవర్‌ట్రెయిన్ 49 kWh బ్యాటరీ, 142 బీహెచ్‌పీ పవర్, 189 ఎన్‌ఎం టార్క్, 7 kW ఏసీ ఛార్జింగ్, రీజెన్ ఫీచర్ ఈ2 వేరియంట్ (ఈ1కు అదనంగా) ఇంటీరియర్: వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, లగేజ్ షెల్ఫ్ సేఫ్టీ: రివర్స్ పార్కింగ్ కెమెరా పవర్‌ట్రెయిన్: 61 kWh బ్యాటరీ, 171.5 బీహెచ్‌పీ మోటార్, 189 ఎన్‌ఎం టార్క్
Details
ఈ3 వేరియంట్ (టాప్ ఎండ్)
ఇంటీరియర్: సింథటిక్ లెదర్ + ఫ్యాబ్రిక్ సీట్లు, పవర్డ్ డ్రైవర్-ప్యాసింజర్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ సేఫ్టీ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, మల్టీ-కొలీషన్ బ్రేక్ రేంజ్ ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 543 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.
Details
ముగింపు
బేస్ వేరియంట్ ఈ1 నుంచే విస్తృత ఫీచర్లతో టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వస్తోంది. ఈ2 వేరియంట్‌లో పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన మోటార్‌తో పాటు అదనపు సౌకర్యాలు లభిస్తాయి. ఇక టాప్ ఎండ్ ఈ3 వేరియంట్‌లో లగ్జరీ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ అడాస్ సిస్టమ్స్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అనుభూతిని అందించనుంది.