LOADING...
VinFast: భారతీయుల అవసరాలే లక్ష్యంగా.. మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లకు వియత్నాం సంస్థ గ్రీన్ సిగ్నల్
భారతీయుల అవసరాలే లక్ష్యంగా.. మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లకు వియత్నాం సంస్థ గ్రీన్ సిగ్నల్

VinFast: భారతీయుల అవసరాలే లక్ష్యంగా.. మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లకు వియత్నాం సంస్థ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 26, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలే భారత మార్కెట్‌లో తన తొలి కారును విడుదల చేసిన వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ 'విన్‌ ఫాస్ట్' (VinFast) ఇప్పుడు భారత ద్విచక్ర వాహన రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2026 ద్వితీయార్థంలో (H2 2026) భారత మార్కెట్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని విన్‌ఫాస్ట్ భావిస్తోంది. ఈ స్కూటర్ల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి గ్లోబల్ మోడల్స్ కాకుండా భారత మార్కెట్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడతాయి. ఈ విషయాన్ని విన్‌ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ శాన్ చౌ స్పష్టం చేశారు.

Details

భారతీయ కస్టమర్ల కోసమే రూపొందరణ

భారతీయ రోడ్లు, ట్రాఫిక్ పరిస్థితులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్కూటర్లను పూర్తిగా భారతీయ కస్టమర్ల కోసం రూపొందించనున్నట్లు తెలిపారు. భారత్‌పై కంపెనీకి ఉన్న దీర్ఘకాలిక లక్ష్యాలనూ ఫామ్ శాన్ చౌ వెల్లడించారు. ఏటా 1 మిలియన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడమే విన్‌ఫాస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తమిళనాడులో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లన్నీ ఈ ప్లాంట్‌లోనే తయారవుతాయి. ఇందుకోసం అక్కడ ప్రత్యేక ప్రొడక్షన్ లైన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న PLI, PM E-DRIVE వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

Details

సరసమైన ధరల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఇవి పెట్టుబడులకు తోడ్పడడమే కాకుండా, వినియోగదారులకు సరసమైన ధరల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించేందుకు సాయపడతాయని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం విన్‌ఫాస్ట్ కార్ ప్లాంట్‌కు 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, ద్విచక్ర వాహనాల విషయంలో మాత్రం ఏటా 10 లక్షల యూనిట్ల భారీ లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించింది. మొత్తం మీద విన్‌ఫాస్ట్ నుంచి వచ్చే ఈ మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లు 2026 ద్వితీయార్థంలో (జూలై-డిసెంబర్ మధ్య) భారత రోడ్లపైకి వచ్చే అవకాశముందని సమాచారం.

Advertisement