Royal Enfield Electric Bike: రెట్రో స్టైల్‌లో ఎలక్ట్రిక్ ఎంట్రీ.. రాయల్ ఎన్ఫీల్డ్ తొలి ఈ-బైక్ రాబోతోంది!
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్, రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బ్రాండ్. ఇప్పుడు ఈ లెజెండరీ కంపెనీ ఎలక్ట్రిక్ యుగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సబ్-బ్రాండ్‌గా 'ఫ్లయింగ్ ఫ్లీ C6'ను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో మొదటి మోడల్ ఫ్లయింగ్ ఫ్లీ C6 2026 తొలి త్రైమాసికంలో (Q1 2026) మార్కెట్‌లోకి రానుందని నిర్ధారించారు. ఈ బైక్ డిజైన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలోని ఒరిజినల్ Flying Flea మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందింది. రెట్రో టచ్‌తో పాటు ఫ్యూచరిస్టిక్ లుక్ కలగలిపిన డిజైన్ దీని ప్రత్యేకత.
Details
ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 150-160 కిలోమీటర్ల వరకు రేంజ్
సరళమైన, లైట్‌వెయిట్ బాడీ, గిర్డర్ ఫ్రంట్ సస్పెన్షన్, ఆర్టిక్యులేటింగ్ మడ్‌గార్డ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ దీనికి ప్రత్యేక ఆకర్షణను తెస్తాయి.సిటీ కమ్యూటింగ్, మొబిలిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను రూపొందించారు. లైట్‌వెయిట్ నిర్మాణం, అగైల్ రైడింగ్ అనుభూతి దీని ప్రధాన హైలైట్. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 150-160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వవచ్చని అంచనా. గరిష్ట వేగం 100-115 కి.మీ/గం మధ్య ఉండే అవకాశం ఉంది. 100 శాతం ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆధునిక ఫీచర్లతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ వంటి అంశాలు ఇందులో ఉంటాయి. Flying Flea C6 కొత్త 'L' ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతోంది.
Details
2లక్షల నుంచి రూ. 2.5-3లక్షల మధ్య ఉండే అవకాశం
ఇదే ప్లాట్‌ఫామ్ ఆధారంగా తర్వాత 'Flying Flea S6'(స్క్రాంబ్లర్ స్టైల్) మోడల్ కూడా రానుంది. ఈ S6 వేరియంట్ 2026 చివర్లో లాంచ్ అయ్యే అవకాశముందని సమాచారం. ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి. గోవిందరాజన్ మాట్లాడుతూ, Flying Flea C6 'అల్మోస్ట్ రెడీ ఫర్ ప్రొడక్షన్' దశలో ఉందని, Q1 2026లో మార్కెట్‌లోకి తీసుకువస్తామని వెల్లడించారు. ప్రస్తుతం భారతదేశంలో, ముఖ్యంగా చెన్నైలో, ఈ బైక్‌ను ఫైనల్ ఫామ్‌లో టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ మోడల్ కవర్ లేకుండా స్పాట్ అయినట్లు కూడా తెలిసింది. ధర విషయానికొస్తే ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అంచనాల ప్రకారం ఎక్స్-షోరూమ్ ధర రూ. 2లక్షల నుంచి రూ. 2.5-3లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.