Aston Martin: ఓపెన్ టాప్‌తో 200 కిమీ వేగంతో...ఆస్టిన్ మార్టిన్ ప్రత్యేకత
ఈ వార్తాకథనం ఏంటి
అడ్వెంచర్ డ్రైవింగ్‌ను ఇష్టపడేవారికి, సూపర్‌కార్లపై ఆసక్తి ఉన్నవారికి ఆస్టన్ మార్టిన్ కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. అదే వాల్హల్లా స్పైడర్. ఈ కారు ప్రత్యేకత ఓపెన్ టాప్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్. రూఫ్‌ను తొలగించి ప్రయాణించే అవకాశం ఉండటంతో రోడ్డుపై డ్రైవింగ్ అనుభవం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఆటో మొబైల్ రంగంలో ఈ కారు ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఏడాది ప్రారంభంలో పరిచయమైన వాల్హల్లా కూపే మోడల్‌కు ఇది ఓపెన్ టాప్ వెర్షన్. లాస్ వేగాస్‌లో ఈ వారాంతంలో జరిగే కాంకోర్స్ ఎట్ వైన్ ప్రదర్శనలో ఈ కారు తొలిసారిగా అందుబాటులోకి రానుంది.
Details
1,064 హెచ్‌పీ శక్తిని అందించే హైబ్రిడ్ ఇంజిన్
వాల్హల్లా స్పైడర్‌లో 4.0 లీటర్ల ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు.
ఈ హైబ్రిడ్ వ్యవస్థ కలిపి 1,064 హెచ్‌పీ గరిష్ఠ శక్తిని, 1,100 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి నాలుగు చక్రాలకు పంపిణీ అవుతుంది.
అధిక వేగంలో కారు అదుపు తప్పకుండా ఉండేందుకు యాక్టివ్ ఏరోడైనమిక్స్ వ్యవస్థను కూడా అందించారు. రేస్ ట్రాక్‌పై మెరుగైన హ్యాండ్లింగ్ కోసం ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు.
Details
రూఫ్‌ను బట్టి గరిష్ఠ వేగంలో మార్పు
ఈ కారు ఫ్యాబ్రిక్ రూఫ్‌ను అవసరమైనప్పుడు తొలగించవచ్చు. అదనపు ఎంపికగా కార్బన్ ఫైబర్ హార్డ్‌టాప్‌ను కూడా ఎంచుకోవచ్చు.
అయితే ఈ రెండు రూఫ్‌లతో కారు గరిష్ఠ వేగంలో తేడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ రూఫ్ అమర్చినప్పుడు గరిష్ఠ వేగం గంటకు 200 కిలోమీటర్లకు పరిమితం అవుతుంది.
కార్బన్ ఫైబర్ హార్డ్‌టాప్ వెర్షన్‌లో మాత్రం గంటకు 349 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవచ్చు. రూఫ్ తొలగించినప్పుడు క్యాబిన్‌లోకి గాలి ఎక్కువగా రాకుండా విండ్ డిఫ్లెక్టర్ ఉపయోగపడుతుంది.
Details
కార్బన్ ఫైబర్‌తో తక్కువ బరువు
వాల్హల్లా స్పైడర్‌లో కార్బన్ ఫైబర్ నిర్మాణాన్ని ఉపయోగించారు. దీనివల్ల బరువును నియంత్రించడంతో పాటు కారు దృఢత్వాన్ని నిలబెట్టవచ్చు.
పైకి తెరుచుకునే కార్బన్ ఫైబర్ డోర్లు, స్టాండర్డ్‌గా ఇచ్చే కార్బన్ ఫైబర్ టూరింగ్ సీట్లు దీని ప్రత్యేకతలు.
కూపే మోడల్‌లోని మరింత స్పోర్టీ కార్బన్ ఫైబర్ సీటును అదనపు ధర లేకుండా ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఓపెన్ కాక్‌పిట్‌తో ఉత్పత్తి చేస్తున్న ఆస్టన్ మార్టిన్ తొలి మిడ్ ఇంజిన్ సూపర్‌కార్‌గా ఇది నిలుస్తుంది.
Details
2027 మూడో త్రైమాసికంలో మార్కెట్లోకి
ఆస్టన్ మార్టిన్ సీఈఓ అడ్రియన్ హాల్‌మార్క్ ప్రకారం, కూపే మోడల్‌లోని రోజువారీ ప్రయాణ సౌకర్యం, రేస్ ట్రాక్ పనితీరుకు ఓపెన్ ఎయిర్ డ్రైవింగ్ అనుభవాన్ని ఈ స్పైడర్ జోడిస్తుంది.
వాల్హల్లా స్పైడర్ 2027 మూడో త్రైమాసికం నుంచి అందుబాటులోకి రానుంది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్, ఓపెన్ టాప్ డిజైన్, గంటకు 349 కిలోమీటర్ల గరిష్ఠ వేగ సామర్థ్యంతో ఈ మోడల్ సూపర్‌కార్ విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.