NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఇండియన్ ఆటో మార్కెట్‍లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
    ఇండియన్ ఆటో మార్కెట్‍లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్
    1/2
    ఆటోమొబైల్స్ 1 నిమి చదవండి

    ఇండియన్ ఆటో మార్కెట్‍లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 01, 2023
    06:37 pm
    ఇండియన్ ఆటో మార్కెట్‍లోకి ఏథెర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్

    ఇండియన్ ఆటోమోబైల్ మార్కెట్‍లోకి ఏథెర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఏథెర్ ఎనర్జీ సంస్థ ఈ స్కూటర్‌ను విడుదల చేసింది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌కు ఏథెర్ 450 ఎస్ పోటీనివ్వనుంది. 125cc వాహనాన్ని పోలిన రైడింగ్ అనుభవాన్ని 450ఎస్ స్కూటర్ ఇస్తుందని ఏథెర్ ఎనర్జీ ప్రకటించింది. జూలైలో బుకింగ్స్ ప్రారంభిమచనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏథెర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3 కిలో వాట్ పర్ హవర్ (kWh) బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ గా చార్జ్ చేస్తే 115 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇది గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకెళ్లనుందని ఏథెర్ ఎనర్జీ తెలిపింది.

    2/2

    రూ.లక్ష ముప్పై వేలకు చేరువలో 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

    అధునాతన ఫీచర్లను ఈ స్కూటర్ కలిగి ఉంటుందని, త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. రూ. 1,29,999 ఎక్స్-షోరూమ్ ధర పలకగా, జూలైలో 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కస్టమర్లు ఏథెర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో బుక్ చేసుకోవచ్చని సూచించింది. జూన్ 1 నుంచి ఫేమ్-2 కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ 15 శాతానికి తగ్గింది. దీంతో 450 ఎక్స్ వాహనం ధర పెరగనుంది. మే 31లోగా కొనుగోలు చేసిన వారికి రూ.32,500 వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ ఇటీవలే వివరించింది. 450 ఎక్స్ కొత్త ధరలను మాత్రం సంస్థ స్పష్టంగా ప్రకటించాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల ఈవీ పాలసీల మేరకు వినియోగదారులు సబ్సిడీ ప్రయోజనాలను అందుకోవచ్చని చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఎలక్ట్రిక్ వాహనాలు

    ఎలక్ట్రిక్ వాహనాలు

    టెస్లా సైబర్‌ట్రక్ ఇంటీరియర్ గురించి ఆసక్తికర విషయాలు లీక్! ఎలాన్ మస్క్
    RunR మొబిలిటీ HS ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు ధర
    అద్భుత ఫీచర్లతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 212km ధర
    ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి బిగ్ షాక్.. సబ్సిడీలో భారీ కోత ధర
    తదుపరి వార్తా కథనం

    ఆటోమొబైల్స్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Auto Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023