
అమెరికా: ఎయిర్ బ్యాగ్ ను తెరిచే ఇన్ ఫ్లేటర్లు బాగోలేవని అమెరికా కంపెనీకి ఆదేశాలిచ్చిన NHTSA
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినేషన్ సంస్థ, అమెరికాకు చెందిన ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్ల తయారీ కంపెనీ ARC ను 67మిలియన్ల ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లను వెనక్కి తీసుకోమని ఆదేశించింది.
ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్ అంటే ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడానికి కార్లో ఉండే చిన్న పరికరం. ఈ ఇన్ ఫ్లేటర్ ల వల్ల ప్రయాణీకులు ప్రమాదాలకు గురవుతున్నాయని NHTSA తెలియజేసింది.
వెనక్కి తీసుకోమని చెప్పిన ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లన్నీ 2018కి ముందు తయారైనవి కావడం విశేషం.
అసలు విషయం ఏంటంటే:
NHTSA చెప్పిన దాని ప్రకారం, ARCకంపెనీ ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లు, ఒకట్రెండు ప్రమాదాల్లో పాడైపోయి ఆ తర్వాత ప్రయాణీకులకు అపాయం కలిగించేలా మారుతున్నాయి.
Details
ముందు సీట్లలో కూర్చున్న వారికి కలిగే ప్రమాదం
ముందు సీట్లోని ఎయిర్ బ్యాగ్ తెరుచుకునేటపుడు, ఇన్ ఫ్లేటర్ చీలిపోతున్నాయని. ఈ నేపథ్యంలో ARCకంపెనీ వారిని ముందు సీట్లోని ఎర్యి బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లను వెనక్కి తీసుకోమని కోరింది NHTSA.
ఇన్ ఫ్లేటర్లలోని సమస్యన్బు 2015లో కనిపెట్టింది NHTSA. 2016, 2021లో ఇన్ ఫ్లేటర్లలో సమస్య కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని NHTSA చెబుతోంది.
జనరల్ మోటార్స్, వోక్స్ వ్యాగన్, ఫోర్డ్, బీ ఎమ్ డబ్ల్యూ వంటి సంస్థల కార్లలో ARCకంపెనీ ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లు ఉన్నాయి.
ఈ విషయంలో ARCకంపెనీ వాదన మరోలా ఉంది. ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లలో ఎలాంటి లోపమూ లేదని చెబుతోంది. ఈ మాటకు రుజువుగా, 2018లో జరిగిన ఫీల్డ్ టెస్ట్ రిపోర్టును చూపెడుతోంది.