2026 Bajaj Pulsar 125 : కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 125.. ఎల్‌ఈడీ టచ్‌తో త్వరలో లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
బజాజ్ పల్సర్... తెలుగు రాష్ట్రాల్లో కుర్రాళ్ల నుంచి ఉద్యోగుల వరకు ఈ పేరు వినగానే ప్రత్యేకమైన క్రేజ్ గుర్తుకు వస్తుంది. ఇప్పటికే పల్సర్ 150 మోడల్‌ను అప్‌డేట్ చేసిన బజాజ్, ఇప్పుడు తన బుజ్జి పల్సర్‌గా పేరొందిన పల్సర్ 125ను కూడా సరికొత్తగా ముస్తాబు చేస్తోంది. దాదాపు 2010 తర్వాత క్లాసిక్ పల్సర్ సిరీస్‌లో వస్తున్న అతిపెద్ద మార్పులు ఇవే కావడం విశేషం.
Details
షోరూమ్‌లకు చేరుతున్న 2026 పల్సర్ 125
అధికారిక లాంచ్‌కు ముందే 2026 బజాజ్ పల్సర్ 125 బైకులు డీలర్‌షిప్ షోరూమ్‌లకు చేరుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వాక్-అరౌండ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బైక్ డిజైన్, ఫీచర్లలో జరిగిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. క్లాసిక్ లుక్.. ఆధునిక టచ్ పల్సర్ కుటుంబంలో ప్రస్తుతం ఎన్ఎస్, ఎన్ సిరీస్ మోడల్స్ ఎంత ట్రెండీగా ఉన్నప్పటికీ, సాధారణ మధ్యతరగతి వినియోగదారులు మాత్రం ఇప్పటికీ 'క్లాసిక్ పల్సర్' వైపే మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చు, నమ్మకమైన పనితీరు, సరసమైన ధరలు ఇందుకు ప్రధాన కారణాలు. ఈ క్లాసిక్ రేంజ్‌లో ఉన్న పల్సర్ 220, 150 మోడల్స్ తరహాలోనే ఇప్పుడు 125 వెర్షన్‌ను కూడా బజాజ్ అప్‌డేట్ చేస్తోంది.
Details
ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌తో కొత్త లుక్
ఈ కొత్త పల్సర్ 125లో అందరినీ ఆకట్టుకునే ప్రధాన మార్పు హెడ్‌లైట్. మొట్టమొదటిసారిగా 125సీసీ సెగ్మెంట్‌లో బజాజ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ను పరిచయం చేసింది. దీనివల్ల బైక్ లుక్ ఒక్కసారిగా మారిపోయింది. హెడ్‌లైట్‌తో పాటు ఇండికేటర్లను కూడా ఎల్‌ఈడీలుగా మార్చడంతో బైక్ మరింత ప్రీమియంగా కనిపిస్తోంది. అయితే పల్సర్ బ్రాండ్‌కు దశాబ్దాలుగా గుర్తుగా నిలిచిన వెనుక వైపు ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త గ్రాఫిక్స్‌తో ఫ్రెష్ ఫీల్ డిజైన్ పరంగా చూస్తే, ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్, ఇంజిన్ కౌల్‌పై కొత్త గ్రాఫిక్స్ జోడించడం ద్వారా బైక్ పాతదనే భావన కలగకుండా బజాజ్ జాగ్రత్తలు తీసుకుంది. తక్కువ బడ్జెట్‌లో పల్సర్ బైక్ కొనాలనుకునే వారు,
Details
లాంచ్, ధర వివరాలు ఇంకా వెల్లడి కాదు
మారుతున్న కాలానికి అనుగుణంగా తన క్లాసిక్ గుర్తింపును కోల్పోకుండా, సరికొత్త ఫీచర్లను జోడించి బజాజ్ పల్సర్ 125ను మళ్లీ పోటీ రంగంలోకి తీసుకొచ్చింది. అయితే ఈ మోడల్ లాంచ్ తేదీ, ధర, ఇతర పూర్తి ఫీచర్ల వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వీటిపై బజాజ్ త్వరలోనే స్పష్టత ఇవ్వనుందని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బజాజ్ పల్సర్ 125 ధర సుమారు రూ. 82 వేలుగా ఉంది. కొత్తగా లాంచ్ అయ్యే అప్‌డేటెడ్ మోడల్ ధర కాస్త ఎక్కువగా ఉండొచ్చని ఆటోమొబైల్ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.