Loading...
New Bajaj Pulsar: 25 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 150.. త్వరలో లాంచ్?
25 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 150.. త్వరలో లాంచ్?

New Bajaj Pulsar: 25 ఏళ్ల తర్వాత కొత్త అవతారంలో బజాజ్ పల్సర్ 150.. త్వరలో లాంచ్?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఐకానిక్ మోడల్‌గా గుర్తింపు పొందిన బజాజ్ పల్సర్ 150 త్వరలో కొత్త అవతారంలో మార్కెట్లోకి రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. పల్సర్ బ్రాండ్ ప్రారంభమై 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా కంపెనీ ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వాహన ప్రియులు జులై నెలాఖరు నాటికి కొత్త పల్సర్ 150 రోడ్లపైకి వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పల్సర్ అనేది బజాజ్‌కు కేవలం ఒక బైక్ మాత్రమే కాదు.. యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన ఐకానిక్ బ్రాండ్. ఒక దశలో ద్విచక్ర వాహన మార్కెట్లో వెనుకబడిన బజాజ్‌ను మళ్లీ బలంగా నిలబెట్టడంలో పల్సర్ కీలక పాత్ర పోషించింది.

వివరాలు

కొత్త మోడల్‌లో ఏం ఉండొచ్చు?

మార్కెట్లో కంపెనీ స్థానాన్ని మరింత బలోపేతం చేసిన మోడల్‌గా పల్సర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

పావు శతాబ్దం తర్వాత వస్తున్న ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌పై ఆటోమొబైల్ ప్రపంచంలో భారీ ఆసక్తి నెలకొంది.

కొత్త పల్సర్ 150లో సరికొత్త ఛాసిస్, అప్‌డేటెడ్ ఇంజిన్, మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థతో పాటు అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

ల్సర్ ప్రయాణం ఇలా..

2001లో బజాజ్ పల్సర్‌ను తొలిసారిగా 150 సీసీ, 180 సీసీ ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. తొలి మోడల్‌లో గుండ్రని రెట్రో హెడ్‌లైట్, సాధారణ స్పోక్డ్ వీల్స్ ఉండేవి.

మజిల్‌మ్యాన్ స్టైల్‌లో రూపొందించిన పెద్ద ఫ్యూయల్ ట్యాంక్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, హ్యాండిల్‌బార్లు ఈ బైక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వివరాలు

టెక్నాలజీతో మరింత బలపడిన పల్సర్

2003లో బజాజ్ DTS-i టెక్నాలజీని పల్సర్‌లో ప్రవేశపెట్టింది. అదే సమయంలో ఐకానిక్ హెడ్‌ల్యాంప్ డిజైన్, అల్లాయ్ వీల్స్‌ను కూడా జోడించింది.

ఆ తర్వాత విడుదలైన పల్సర్ 180, పల్సర్ 220 మార్కెట్లో భారీ విజయాన్ని సాధించాయి. 2007లో పల్సర్ 220, 2009లో పల్సర్ 135, 2012లో పల్సర్ NS, 2015లో పల్సర్ RS200ను కంపెనీ వరుసగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం పల్సర్ శ్రేణి 125 సీసీ నుంచి ప్రారంభమవుతున్నప్పటికీ, ఇప్పటికీ ఎంతోమంది బైక్ ప్రేమికులు పాత పల్సర్ 150 మోడల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక మోడల్

పల్సర్ బ్రాండ్‌కు 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో బజాజ్ తన అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ 150 ను కొత్త రూపంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, జులై నెలాఖరులోపు ఈ కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

పావు శతాబ్దం తర్వాత వస్తున్న ఈ అప్‌డేట్ కోసం వాహన ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT