Benelli TRK 522: అడ్వెంచర్స్ అంటే ఇష్టమా... మీకోసమే ఈ కొత్త బైక్
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ప్రాంతాలకు బైక్‌పై ప్రయాణించడం, లాంగ్ రైడ్స్ చేయడం ఇష్టపడేవారిని ఆకట్టుకునేలా Benelli కొత్త అడ్వెంచర్ టూరింగ్ బైక్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. TRK 552 ధర రూ.7.22 లక్షలు కాగా, TRK 552X ధర రూ.7.74 లక్షలు (ఎక్స్‌షోరూమ్). వీటిలో TRK 552X లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.7.90 లక్షలుగా ఉంది. అక్టోబర్ 22 నుంచి Benelli Keeway డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Details
554 సీసీ ఇంజిన్.. 52 బీహెచ్‌పీ పవర్
ఈ మూడు మోడళ్లలో ప్రధానంగా 554 సీసీ లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది.
ఇది 8,500 ఆర్‌పీఎం వద్ద 52 బీహెచ్‌పీ పవర్, 6,500 ఆర్‌పీఎం వద్ద 49 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు గేర్ల గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ ప్రామాణికంగా అందించారు.
TRK 552 రోడ్లు, హైవేలపై ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించారు. TRK 552Xలో పెద్ద ఫ్రంట్ వీల్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో ప్రయాణించాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.
Details
టెక్నాలజీ, సౌకర్యాలకు ప్రాధాన్యం
రెండు బైక్‌లలో 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, రూట్ ప్లానింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఆఫ్‌లైన్ నావిగేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వేడిని అందించే హ్యాండిల్ గ్రిప్స్, హీటెడ్ సీట్, USB ఛార్జింగ్ సదుపాయం కూడా కల్పించారు.
Details
భద్రత ఎలా ఉంది?
50 మి.మీ. Marzocchi అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి.
ముందు రెండు 320 మి.మీ. డిస్క్‌లు, వెనుక 260 మి.మీ. డిస్క్‌తో పాటు Bosch డ్యూయల్ ఛానల్ ABS అందించారు. మొత్తంగా చూసుకుంటే కనుక... సుదూర ప్రయాణాల్లో సౌకర్యం, ఆధునిక టెక్నాలజీ, అడ్వెంచర్ సామర్థ్యాలను కోరుకునేవారికి ఈ బైక్‌లు కొత్త ఎంపికగా నిలుస్తాయి.
అయితే ధరతో పాటు బైక్ బరువు, సీటు ఎత్తు, తమ ప్రయాణ అవసరాలను పరిశీలించి మోడల్‌ను ఎంచుకోవడం మంచిది.