Loading...
Bentley Torcal: బెంట్లీ టోర్కల్‌ ఈవీ వచ్చేసింది.. 888 పీఎస్‌ పవర్‌, 600 కి.మీ. రేంజ్
బెంట్లీ టోర్కల్‌ ఈవీ వచ్చేసింది.. 888 పీఎస్‌ పవర్‌, 600 కి.మీ. రేంజ్

Bentley Torcal: బెంట్లీ టోర్కల్‌ ఈవీ వచ్చేసింది.. 888 పీఎస్‌ పవర్‌, 600 కి.మీ. రేంజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల సంస్థ బెంట్లీ తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ వాహనం 'టోర్కల్‌'ను ఆవిష్కరించింది. ఇది టోర్కల్‌,టోర్కల్‌ ఎస్‌ వేరియంట్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే WLTP ప్రకారం 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 800V ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీతో బ్యాటరీని 10 నుంచి 80 శాతానికి కేవలం 16నిమిషాల్లో ఛార్జ్‌ చేయవచ్చు. టోర్కల్‌లో డ్యూయల్‌ మోటార్‌ సెటప్‌ ఉంది. ఇది 888 PS పవర్‌,1,350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0-100 కి.మీ. వేగాన్ని కేవలం 2.9సెకన్లలో అందుకుంటుంది. 113 kWh ఉపయోగించగల సామర్థ్యమున్న బ్యాటరీలో 192 లిథియం-అయాన్‌ సెల్స్‌ ఉన్నాయి. బ్యాటరీకి 10 ఏళ్లు లేదా 1 లక్ష మైళ్ల వారంటీని బెంట్లీ అందిస్తోంది.

వివరాలు 

కొత్త బెంట్లీ ఎంబ్లమ్‌ను పొందిన తొలి మోడల్

డిజైన్‌లో కొత్త లోగో,వెలిగే గ్రిల్‌, పొడవైన వీల్‌బేస్‌, చిన్న ఓవర్‌హ్యాంగ్స్‌తో ప్రత్యేకమైన రూపాన్ని అందించారు.

టోర్కల్‌లో 21 అంగుళాల, టోర్కల్‌ ఎస్‌లో 22 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఉంటాయి.

ఇది కొత్త బెంట్లీ ఎంబ్లమ్‌ను పొందిన తొలి మోడల్‌. ఇంటీరియర్‌లో లెదర్‌, మెరినో వూల్‌, వుడ్‌ వెనీర్‌, అల్యూమినియం వంటి ప్రీమియం మెటీరియల్స్‌ ఉన్నాయి.

16-వే అడ్జస్ట్‌మెంట్‌, హీటింగ్‌, వెంటిలేషన్‌, మసాజ్‌ సదుపాయాలతో సీట్లు లభిస్తాయి. వెనుక సీటు పవర్‌ ఫోల్డింగ్‌ సదుపాయం కూడా తొలిసారిగా అందించారు.

16-స్పీకర్‌, 620W ఆడియో సిస్టమ్‌ స్టాండర్డ్‌గా ఉండగా, 28-స్పీకర్‌ 1,780W నెయిమ్‌ ఆడియో సిస్టమ్‌ను ఆప్షన్‌గా అందిస్తున్నారు.

ఇంజిన్‌ శబ్దానికి బదులుగా 'బెంట్లీ డైనమిక్‌ సింఫనీ' పేరుతో ప్రత్యేక సౌండ్‌ సిస్టమ్‌ను కూడా రూపొందించారు.

ADVERTISEMENT