BMW M440i: BMW M440i Convertible భారత్‌లో లాంచ్.. స్పీడ్, స్టైల్‌తో అదిరిపోయే ఫీచర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం BMW భారత మార్కెట్లో కొత్త M440i కన్వర్టిబుల్ కారును విడుదల చేసింది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.09 కోట్లు. 4 సిరీస్, M4 మోడళ్ల మధ్య పొజిషన్‌లో ఉండే ఈ కార్, పెర్ఫార్మెన్స్‌తో పాటు ఓపెన్ టాప్ డ్రైవింగ్ అనుభూతిని అందించడమే ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా లగ్జరీ, స్పోర్టీ డ్రైవింగ్ ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్‌గా భావిస్తున్నారు. డిజైన్ విషయానికి వస్తే, M440i కన్వర్టిబుల్ BMW సిగ్నేచర్ స్టైల్‌ను కొనసాగిస్తోంది. లాంగ్ బోనెట్,లో-స్లంగ్ స్టాన్స్, పెద్ద కిడ్నీ గ్రిల్ ఈ కార్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. LED హెడ్‌లైట్స్,స్లీక్ టెయిల్ లైట్స్ కార్ లుక్‌ను మరింత ప్రీమియంగా మార్చాయి.
వివరాలు
19 ఇంచ్ అలాయ్ వీల్స్
ముఖ్యంగా హార్డ్‌టాప్ స్థానంలో సాఫ్ట్ ఫాబ్రిక్ రూఫ్ ఇచ్చారు. ఈ రూఫ్‌ను కేవలం 18 సెకండ్లలో ఓపెన్ లేదా క్లోజ్ చేయవచ్చు. 50 కిమీ/గం వేగం వరకు ప్రయాణిస్తూనే ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. ఈ కార్ 19 ఇంచ్ అలాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ముందు టైర్లు 225/45 R19 సైజ్‌లో ఉండగా, వెనుక టైర్లు 255/35 R19 సైజ్‌లో ఉంటాయి. ఇది డ్రైవింగ్ స్టెబిలిటీ, గ్రిప్‌ను మెరుగుపరుస్తుంది. రెండు డోర్ల కార్ కావడంతో వెనుక సీట్లకు వెళ్లాలంటే ముందరి సీటును ఫోల్డ్ చేయాలి. రియర్ భాగంలో డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్, స్టైలిష్ LED టెయిల్ లైట్స్ కార్‌కు స్పోర్టీ లుక్ ఇస్తాయి.
వివరాలు
కన్వర్టిబుల్ 2+2 సీటింగ్ లేఅవుట్
ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ కన్వర్టిబుల్ 2+2 సీటింగ్ లేఅవుట్‌తో వస్తుంది. డ్రైవర్ ఫోకస్ క్యాబిన్ ఉండటంతో డ్రైవింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. 14.9 ఇంచ్ కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు, మెమరీ ఫంక్షన్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
వివరాలు
374 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్
పర్ఫార్మెన్స్ పరంగా ఈ కార్ చాలా పవర్‌ఫుల్. 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్-సిక్స్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 374 హెచ్‌పీ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, BMW xDrive ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో ఈ ఇంజిన్ పనిచేస్తుంది. స్పీడ్ విషయానికి వస్తే, M440i కన్వర్టిబుల్ కేవలం 4.9 సెకండ్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్‌ను ఎలక్ట్రానిక్‌గా 250 కిమీ/గం వద్ద లిమిట్ చేశారు. అంటే ఇది స్పీడ్, కంట్రోల్ రెండింటిలోనూ అద్భుతమైన బ్యాలెన్స్ ఇస్తుంది.
వివరాలు
ఓపెన్ టాప్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్
భారత మార్కెట్లో ఈ కార్‌కు ప్రధాన పోటీగా Mercedes-Benz CLE Cabriolet నిలుస్తోంది. ఈ మోడల్ ధర సుమారు రూ.1.16 కోట్లు (ఎక్స్-షోరూమ్). ధర కొంచెం ఎక్కువైనా, ఫీచర్లు, బ్రాండ్ విలువ కారణంగా రెండు కార్లు కూడా లగ్జరీ సెగ్మెంట్‌లో మంచి పోటీని సృష్టిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే, BMW M440i కన్వర్టిబుల్ స్పీడ్, లగ్జరీ, స్టైల్ అన్నీ కలిసిన ప్యాకేజ్‌గా నిలుస్తోంది. ఓపెన్ టాప్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారనుంది.