త్వరపడండి.. Tata Altroz iCNG మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభం
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియాలో తన అల్ట్రాజ్ మోడల్ యొక్క CNG వేరియంట్‌ల కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. అల్ట్రాస్ iCNG ఏ ఏ ఫీచర్లు కలిగి ఉందో తెలుసుకుందాం. కొత్త అల్ట్రాస్ XE, XM+, XZ మరియు XZ+ అనే నాలుగు ట్రిమ్‌లలో ప్రారంభించారు. దాని టాప్ ట్రిమ్‌లో, టాటా 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వాయిస్ ఆపరేటెడ్ సన్‌రూఫ్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ వంటి సౌకర్యాలను అందించింది. Tata Altroz iCNG బ్రాండ్ ఆధునిక డిజైన్ ఫిలాసఫీని అనుసరిస్తుంది, ALFA-ARC ప్లాట్‌ఫారమ్ ద్వారా మద్దతునిస్తుంది.
కారు ధర, వివరాలు
ర్యాప్-అరౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ వెనుక చివరిన అందించనుంది. భద్రతా లక్షణాలలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, స్థిరత్వ నియంత్రణ ఉన్నాయి. ముఖ్యంగా, దాని స్టాండర్డ్ వేరియంట్ గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. హ్యాచ్‌బ్యాక్‌లో విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్ ఉంది, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, కీ-లెస్ ఎంట్రీ, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ కారు బుకింగ్ చేసుకోవాలంటే 21 వేలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టాటా మోటార్స్ రాబోయే నెలల్లో Altroz iCNG ధర వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. దీని ధర దాదాపుగా రూ.7.3 లక్షలు ఉండనుంది.