మారుతీ, హ్యూందాయ్: కార్ల మార్కెట్ షేర్ లో తగ్గింపు, కారణం అదే
మిడిల్ క్లాస్ వాహనాలను తయారు చేసే సంస్థగా పేరున్న మారుతీ సుజుకీ ఇండియా మార్కెట్ షేర్ తగ్గిపోయింది. హ్యూందాయ్ మార్కెట్ షేర్ కుడా పడిపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే పెరిగాయి. కాకపోతే మార్కెట్ లో మారుతీ సుజుకీ కార్ల షేర్ మాత్రం తగ్గింది. ఇదే పరిస్థితి హ్యూందాయ్ కార్లకు కూడా కలిగింది. ఈ విషయాన్ని ఫాడా (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్) వెల్లడి చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మారుతీ కార్ల అమ్మకాలు 14,79,221గా ఉన్నాయి. 2021-22లో 12,39,688గా ఉన్నాయి. కాకపోతే మార్కెట్ షేర్ చూసుకుంటే, 2022-23లో 40.86%గా ఉంది. 2021-22లో 42. 13%గా ఉంది.
మార్కెట్ షేర్ తగ్గిపోవడానికి కారణమేంటంటే
ఇక హ్యూందాయ్ కార్ల విషయానికి వస్తే, 2022-23 - 5,25,088యూనిట్లు 2021-22 - 4,79,027 యూనిట్లు. మార్కెట్ షేర్: 2022-23లో 14.51%గా ఉంటే, 2021-22లో 16.28%గా ఉంది. మారుతీ, హ్యూందాయ్ మార్కెట్ షేర్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం, ఈ కంపెనీల విడిభాగాలు దొరక్కపోవడమే అని ఫాడా తెలియజేసింది. విడిభాగాల కొరత కారణంగా మార్కెట్ షే మీద ప్రభావం పడిందని ఫాడా వెల్లడి చేసింది. అదలా ఉంచితే, టాటా మోటార్స్, మహీంద్ర, కియా ఇండియా కంపెనీల మార్కెట్ షేర్ పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి