BYD Denza:భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమౌతున్న బీవైడీ డెంజా...ఫీచర్స్ ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
భారత లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ సిద్ధమవుతోంది. తన ప్రీమియం బ్రాండ్ 'డెంజా'ను నవంబర్ 13న దేశీయంగా పరిచయం చేయనుంది. ఈ సందర్భంగా డెంజా డీ9 లగ్జరీ ఎంపీవీ, జెడ్9 జీటీ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వంటి మోడళ్ల వివరాలతో పాటు ప్రత్యేక షోరూమ్‌ల ఏర్పాటుపై కంపెనీ ప్రకటన చేసే అవకాశం ఉంది. మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి బ్రాండ్లకు పోటీగా నిలవడం బీవైడీ లక్ష్యంగా కనిపిస్తోంది.
Details
డెంజా డీ9.. ప్రయాణంలోనే విలాసం
భారత్‌లో డెంజా తొలి మోడల్‌గా డీ9 ఎంపీవీ వచ్చే అవకాశముంది. కుటుంబ ప్రయాణాలు, వ్యాపార అవసరాల కోసం లగ్జరీ వాహనాలను కోరుకునే వారికి ఇది ప్రత్యేక ఎంపిక కానుంది.
టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్‌ఎం, కియా కార్నివాల్, ఎంజీ ఎం9 వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వొచ్చు.
డీ9లో 103 kWh బ్యాటరీ, 308 bhp శక్తి, 360 Nm టార్క్ ఉండనున్నట్లు సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే WLTP ప్రమాణాల ప్రకారం 520 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.9 సెకన్లలో అందుకుంటుంది. 200 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ధర రూ.85 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
Details
జెడ్9 జీటీ.. వేగానికి మరో నిర్వచనం
డెంజా జెడ్9 జీటీ నాలుగు డోర్ల షూటింగ్ బ్రేక్ డిజైన్‌తో రానుంది. 122.5 kWh బ్యాటరీ, మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో రూపొందిన ఈ కారు 1,140 bhp శక్తిని అందించనుంది.
ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థతో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.7 సెకన్లలో చేరుకోగలదు. గరిష్ఠ వేగం గంటకు 270 కిలోమీటర్లు.
ఒక్క ఛార్జ్‌తో 600 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని అంచనా. డెంజా కోసం సాధారణ బీవైడీ షోరూమ్‌లకు భిన్నంగా ప్రత్యేక లగ్జరీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది.
హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబై వంటి నగరాల్లో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది.