BYD Seal EV: BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ బ్యాటరీ లోపం.. రీకాల్ చేసిన కంపెనీ..
ఈ వార్తాకథనం ఏంటి
చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD ఇండియా తన సీల్ (Seal)ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్ కోసం స్వచ్ఛంద రీకాల్ ప్రక్రియను ప్రారంభించింది. వాహనంలోని హై-వోల్టేజ్ బ్లేడ్ బ్యాటరీలో ఏర్పడే లోపాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న సీల్ కార్ల యజమానులు తమ వాహనాలను సమీప సర్వీస్ సెంటర్లకు తీసుకురావాలని BYD సూచించింది. సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్లు,బ్యాటరీ ప్యాక్‌లోని కొన్ని సెల్స్‌లో లోపం ఉండే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రభావిత వాహనాల సంఖ్యను కంపెనీ వివరించకపోయినా,వినియోగదారుల భద్రత, వాహన విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకొని ఈ జాగ్రత్త చర్యలు చేపట్టామని పేర్కొంది. సీల్ యజమానులు ముందుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాల్సిన అవసరం ఉందని BYD పేర్కొంది.
వివరాలు
ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా..
సర్వీస్ సమయంలో వాహనంపై ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD) పరీక్ష నిర్వహించి, బ్యాటరీ సెల్స్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయా అని గుర్తిస్తారు. సమస్య కనుక్కోబడితే, వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మొత్తం బ్యాటరీ ప్యాక్‌ను మార్చిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. సర్వీస్ సెంటర్‌కు వాహనం తీసుకురావడం కష్టమయిన యజమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేసినట్లు BYD వెల్లడించింది. సంస్థ సిబ్బంది వాహనాన్ని యజమాని వద్ద నుంచి తీసుకొని, తనిఖీ పూర్తయిన తరువాత తిరిగి అందజేస్తారు. ఎక్కువ వాహనాలను అదే రోజు తిరిగి యజమానుల వద్దకు అందజేస్తారని BYD తెలిపింది. ఈ రీకాల్ కేవలం సీల్ మోడల్కు మాత్రమే వర్తిస్తుందని BYD ఇండియా వెల్లడించింది.
వివరాలు
భారత్‌లో అమ్ముతున్న ఇతర BYD ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రీకాల్ వర్తించదు
భారత్‌లో అమ్ముతున్న ఇతర BYD ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రీకాల్ వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను 61.44 kWh, 82.56 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో మార్కెట్లో ప్రవేశ పెట్టారు. ఈ మోడల్ డైనమిక్ (స్టాండర్డ్ రేంజ్),ప్రీమియం(ఎక్స్‌టెండెడ్ రేంజ్),పర్ఫార్మెన్స్ (ఆల్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతోంది. ధరలు ఎక్స్-షోరూమ్ ₹41 లక్షల నుంచి ₹53.15 లక్షల వరకు ఉన్నాయని కంపెనీ తెలిపింది. కాగా,BYD అభివృద్ధి చేసిన బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ భద్రత,అధిక ఎనర్జీ డెన్సిటీలో ప్రసిద్ధి చెందింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో,వాహన భద్రత,పనితీరుపై తయారీ సంస్థలు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నదని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.