Loading...
Cadillac Escalade-V: కాడిలాక్ 125 ఏళ్ల వేడుక...స్పెషల్ ఎడిషన్ ధర తెలిస్తే షాక్‌ అవుతారు
కాడిలాక్ 125 ఏళ్ల వేడుక...స్పెషల్ ఎడిషన్ ధర తెలిస్తే షాక్‌ అవుతారు

Cadillac Escalade-V: కాడిలాక్ 125 ఏళ్ల వేడుక...స్పెషల్ ఎడిషన్ ధర తెలిస్తే షాక్‌ అవుతారు

వ్రాసిన వారు Balachander Sharma
Oct 23, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

కాడిలాక్ తన 125 ఏళ్ల చరిత్రను గుర్తుచేసుకుంటూ అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అమెరికాకు చెందిన ఈ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ విడుదల చేసిన 'ఎస్కలేడ్-వి 125వ యానివర్సరీ కలెక్టర్ సిరీస్' ధర ఏకంగా 2,39,000 డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.2.1 కోట్లకు పైగా ఉంటుంది. కేవలం 252 యూనిట్లను మాత్రమే తయారు చేయనున్న ఈ ప్రత్యేక మోడల్‌లో లగ్జరీతో పాటు శక్తివంతమైన ఇంజిన్, ప్రత్యేక డిజైన్ ఆకట్టుకుంటున్నాయి.

Details

రెండు ప్రత్యేక రంగుల్లో..

ఈ వార్షికోత్సవ ఎడిషన్‌ను మిడ్‌నైట్ స్టోన్ ఫ్రాస్ట్, వైబ్రంట్ వైట్ ట్రైకోట్ అనే రెండు రంగుల్లో అందిస్తున్నారు.

ఇందులో 24 అంగుళాల ప్రత్యేక వీల్స్, బ్లూ బ్రేక్ కాలిపర్లు, డార్క్ ఫినిష్ బ్యాడ్జీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గ్రిల్ చుట్టూ, వెనుక భాగంలోని లోయర్ ఫాసియాస్, సైడ్ మిర్రర్ క్యాప్స్‌పై కార్బన్ ఫైబర్ ట్రిమ్‌ను ఉపయోగించారు.

ఇవి వాహనానికి మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. కారు లోపల బ్లాక్, గ్రే కలర్ కాంబినేషన్‌తో పాటు సాంటోరిని బ్లూ స్టిచింగ్‌ను ఇచ్చారు. బ్లూ సీట్ బెల్ట్స్, ప్రత్యేక సిల్ ప్లేట్స్, ప్రీమియం ఫ్లోర్ మ్యాట్స్, బ్లూ కీ ఫాబ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొనుగోలుదారులు తమకు నచ్చిన VIN, సీరియల్ నంబర్‌ను కూడా ఎంచుకోవచ్చు.

Details

683 హెచ్‌పీ శక్తివంతమైన ఇంజిన్

ఈ ఎస్‌యూవీ అసలైన బలం దాని ఇంజిన్‌లో ఉంది. ఇందులో 6.2 లీటర్ సూపర్‌చార్జ్డ్ LT4 V8 ఇంజిన్‌ను అమర్చారు.

ఇది 683 హెచ్‌పీ శక్తిని, 885 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలాంటి అదనపు పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్ లేకుండానే ఈ స్థాయి శక్తిని అందించడం విశేషం.

ADVERTISEMENT

Details

కేవలం 252 కార్లే..

సాధారణ 2027 ఎస్కలేడ్-వి మోడల్‌తో పోలిస్తే ఈ ప్రత్యేక ఎడిషన్ ధర 66,805 డాలర్లు ఎక్కువ.

ప్రస్తుతం ఈ వాహనం కొనుగోలుకు ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. కేవలం 252 యూనిట్ల ఉత్పత్తితో లిమిటెడ్ ఎడిషన్‌గా రూపొందించడం వల్ల లగ్జరీ కార్ల కలెక్టర్లకు ఇది మరింత ప్రత్యేకంగా మారనుంది.

కాడిలాక్ ఈ మోడల్‌తో తన చరిత్రను మాత్రమే కాకుండా, వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా లగ్జరీ కార్లను రూపొందించే అవకాశాన్ని కూడా చూపిస్తోంది.

ADVERTISEMENT