LOADING...
Fiat Topolino XS : స్మార్ట్‌వాచ్‌తో కార్ కంట్రోల్.. 3 రూపాల్లో మారే ఎలక్ట్రిక్ వాహనం ఇదే!
స్మార్ట్‌వాచ్‌తో కార్ కంట్రోల్.. 3 రూపాల్లో మారే ఎలక్ట్రిక్ వాహనం ఇదే!

Fiat Topolino XS : స్మార్ట్‌వాచ్‌తో కార్ కంట్రోల్.. 3 రూపాల్లో మారే ఎలక్ట్రిక్ వాహనం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్నాలజీ అభివృద్ధి వాహన రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో హైటెక్ ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డిజైనర్ విన్నీ కామాచో రూపొందించిన ఫియట్ టోపోలినో XS కాన్సెప్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్నదైనా, ప్రత్యేకతలతో నిండిన ఈ ఎలక్ట్రిక్ కారు భవిష్యత్తులో పట్టణ డ్రైవింగ్ విధానాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది కూపే తరహాలో కనిపించడమే కాకుండా, వినియోగదారులు తమ అవసరాలు, మూడ్‌కు అనుగుణంగా మార్చుకునే త్రీ-ఇన్-వన్ (3-ఇన్-1) ఫీచర్‌ను అందిస్తుంది. ఈ కారులో ప్రధాన ఆకర్షణ దాని మాడ్యులర్ సిస్టమ్. టోపోలినో XS లో భాగాలను యాడ్ చేయడం లేదా తొలగించడం వినియోగదారుల చేతనే సాధ్యమవుతుంది.

Details

మూడు వేర్వేరు రూపాల్లో ఉపయోగించుకోవచ్చు

పైకప్పు, విండ్‌షీల్డ్, కిటికీలను తీసివేయగల విధంగా డిజైన్ చేశారు. దీనివల్ల కారు మూడు వేర్వేరు రూపాల్లో ఉపయోగించవచ్చు. కూపే - పూర్తిగా మూసివేసిన సాధారణ కారు. రోడ్‌స్టర్ - ఓపెన్ రూఫ్‌తో స్టైలిష్ ప్రయాణం. రూఫ్‌లెస్ మినీ - రూఫ్, విండ్‌షీల్డ్, కిటికీలు లేకుండా పూర్తిగా ఓపెన్ మోడ్.

Details

అందుబాటులో స్మార్ట్ స్టీరింగ్ కారు

డిజైన్ పరంగా ఈ కారు సరళతకు ప్రాధాన్యం ఇస్తుంది. గోళాకార ఆకృతితో రూపొందించిన బాడీ, బాడీలోనే కలిసిపోయే హెడ్‌లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ముందు లైట్లు గుండ్రని ముఖాన్ని పోలి ఉంటే, వెనుక టెయిల్‌లైట్లలో వందలాది చిన్న LED లు ఉంటాయి. వీటిని వినియోగదారులు వివిధ నమూనాల్లోకి మార్చుకునే వీలుంది. ఇంకా ఈ కారులో స్మార్ట్ స్టీరింగ్ వీల్ ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా స్టీరింగ్ తిప్పినప్పుడు డిస్ప్లే కూడా తిరిగి సమాచారం చదవడం కష్టమవుతుంది. కానీ టోపోలినో XS లో స్టీరింగ్ మధ్య భాగం—డిస్ప్లే, హార్న్—స్థిరంగా ఉంటుంది. డ్రైవర్ స్టీరింగ్ తిప్పినా అవి తమ స్థానంలోనే ఉంటాయి.

Advertisement

Details

2.4 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల వెడల్పుతో తయారు

పరిమాణ పరంగా ఇది కేవలం 2.4 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. దీంతో ఇరుకైన వీధుల్లో సులభంగా పార్కింగ్ చేయవచ్చు. చిన్న పరిమాణం ఉన్న బ్యాటరీని ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌తో పాటు స్మార్ట్‌వాచ్ ద్వారా కూడా కారును నియంత్రించే సౌకర్యం కలదు. చిన్న కారు అయినప్పటికీ, సరిపడా సామాను నిల్వ సదుపాయం ఉంది. అదనపు స్టోరేజ్ కోసం కారు వెలుపల ప్రత్యేక రాక్ ఏర్పాటు చేయవచ్చు. అంతేకాకుండా లోపల సులభంగా సరిపడే ప్రత్యేక ట్రాలీ బ్యాగులను కూడా డిజైనర్లు రూపొందించారు. ప్రస్తుతం ఫియట్ టోపోలినో XS ఒక కాన్సెప్ట్ మోడల్ మాత్రమే. ఇది ఇంకా షోరూమ్‌లలో అమ్మకానికి అందుబాటులోకి రాలేదు.

Advertisement