Page Loader
హ్యాకింగ్‌కు గురైన చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'నియో'
హ్యాకింగ్ బారిన పడ్డ నియో కంపెనీ

హ్యాకింగ్‌కు గురైన చైనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'నియో'

వ్రాసిన వారు Stalin
Dec 22, 2022
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం నియో కంపెనీ సాఫ్ట్‌వేర్ హ్యాకింగ్ బారిన పడింది. తమ సంస్థకు చెందిన కంప్యూటర్లలోని వినియోగదారులు, వాహనాల అమ్మకాల డేటాను హ్యాకర్లు చోరీ చేసినట్లు నియో యాజమాన్యం ప్రకటించింది. అయితే హ్యాకింగ్ విషయాన్ని నియో కంపెనీకి... స్వయంగా హ్యాకర్లే చెప్పడం గమనార్హం. కంపెనీ అంతర్గత డేటా తమ వద్ద ఉందని, తమకు 2.25 మిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్లను ఇవ్వాలని డిమాండ్ చేసూ... ఈ మేరకు హ్యాకర్లు మెయిల్ పంపారు. డేటా చోరీపై ప్రభుత్వ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు నియో కంపెనీ తెలిపింది.

నియో

డేటా రక్షణకు బిలియన్ల డాలర్ల ఖర్చు..

ఇటీవల సైబర్ నేరగాళ్లు ఆటోమొబైల్ పరిశ్రమలే టార్గెట్‌గా అటాక్ చేస్తున్నారు. జర్మన్ టైర్, ఆటోమోటివ్ విడిభాగాల తయారీ చేసే 'కాంటినెంటల్' డేటా చోరీకి గురైందని నవంబర్‌లో కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో డేటా రక్షణకు ఆటోమొబైల్ పరిశ్రమలు బిలియన్ల డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. నియో లాంటి దిగ్గజ కంపెనీ డేటానే చోరీ కావడాన్ని చైనా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. డేటాను పటిష్టం చేయడానికి, దేశంలో స్థానికంగా ఉత్పత్తికి సంబంధించిన కీల కీలక డేటాను నిల్వ చేయడానికి చైనా ప్రభుత్వం ఆటోమేకర్లను ప్రోత్సహిస్తోంది.