Page Loader
పూర్తిగా అమ్ముడుపోయిన Ducati Panigale V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా బైక్‌లు
పనిగేల్ V4 బగ్నాయా, పానిగేల్ V4 బౌటిస్టా

పూర్తిగా అమ్ముడుపోయిన Ducati Panigale V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా బైక్‌లు

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 30, 2022
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ నెల ప్రారంభంలో ఆవిష్కరించబడిన నెంబర్ తో ఉన్న పరిమిత ఎడిషన్ పనిగేల్ V4 బగ్నాయా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా, పానిగేల్ V4 బౌటిస్టా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా అమ్ముడయ్యాయని Ducati సంస్థ ప్రకటించింది. ఈ సీజన్‌లో MotoGP, WorldSBKలో డుకాటీ విజయాన్ని పురస్కరించుకుని ఈ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది. పానిగేల్ V4 బగ్నాయా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా, పానిగేల్ V4 బటిస్టా 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికాలో ఒక్కొక్కటి 260 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేశారు. పానిగేల్ V4 2022 వరల్డ్ ఛాంపియన్ రెప్లికా సింగిల్-సీటర్ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది, మోడల్ పేరు, ప్రోగ్రెసివ్ నంబర్, రేస్ నంబర్‌లు పై క్లాంప్‌పై చెక్కబడి ఉంటాయి.

Ducati

2022 Ducatiకి బాగా కలిసివచ్చిన సంవత్సరం

"2022 ట్రాక్‌లో, మార్కెట్‌లో Ducatiకి బాగా కలిసివచ్చిన సంవత్సరం. ఉత్పత్తి, రేసింగ్‌ల మధ్య సాంకేతికత వంటివాటితో మోటార్‌సైక్లింగ్ ప్రపంచంలోనే ఉత్తమ సంస్థగా ఆవిర్భవించింది," అని Ducati గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో మిలిసియా అన్నారు. "వినియోగదారులకు Ducati lenovo టీం తరుపున MOTOGPలో పాల్గొన్న పెక్కో, అల్వారోలచే వ్యక్తిగతంగా సంతకం చేయబడిన ప్రత్యేకమైన నంబర్‌లు గల బైక్‌లను అందించడం, 2022 విజయాలను పంచుకోవడానికి ఉత్తమమైన మార్గంగా మేము భావించాము. అదే సమయంలో, మా బ్రాండ్ ఎప్పటిలాగే పటిష్టంగా ఉందని ఈ అమ్మకాల ద్వారా అర్ధమైంది. 1926 నాటి డుకాటీ స్థాపనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాము" అన్నారు.