Loading...
Future Jeep Cars: భారత్‌లోకి చైనా నుంచి జీప్ కార్లు.. స్టెల్లాంటిస్ కీలక ప్రణాళిక
భారత్‌లోకి చైనా నుంచి జీప్ కార్లు.. స్టెల్లాంటిస్ కీలక ప్రణాళిక

Future Jeep Cars: భారత్‌లోకి చైనా నుంచి జీప్ కార్లు.. స్టెల్లాంటిస్ కీలక ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2026
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల మాతృసంస్థ స్టెల్లాంటిస్ భారత్‌లో కొత్త కార్లను విడుదల చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రెండు బ్రాండ్ల నుంచి మొత్తం 12 కొత్త మోడళ్లను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా 2030 నాటికి ఐదు మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. వీటిలో నాలుగు పూర్తిగా కొత్త కార్లు కాగా, మరొకటి అప్‌డేట్ చేసిన మోడల్. బీ-ఎస్‌యూవీ, సీ-ఎస్‌యూవీ, డీ-ఎస్‌యూవీతో పాటు డీ-సెగ్మెంట్ పికప్ ట్రక్‌ను కూడా తీసుకురావాలని భావిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీటిలో కొన్ని కార్లను చైనాలో తయారు చేసి భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం స్టెల్లాంటిస్.. డాంగ్‌ఫెంగ్ ప్యుగోట్ సిట్రోయెన్ ఆటోమొబైల్ (DPCA) సంస్థతో ఉన్న భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

వివరాలు 

జీప్ కొత్త ఎన్ఈవీల కోసం స్టెల్లాంటిస్, డాంగ్‌ఫెంగ్ ఒప్పందం

2026 మేలో స్టెల్లాంటిస్, డాంగ్‌ఫెంగ్ సంస్థలు 8 బిలియన్ చైనీస్ యువాన్లకు పైగా విలువైన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందం ప్రకారం.. 2027 నుంచి చైనాలోని వుహాన్ ప్లాంట్‌లో రెండు కొత్త ప్యుగోట్ కార్లతో పాటు జీప్ బ్రాండ్‌కు చెందిన రెండు ఆఫ్‌రోడ్ న్యూ ఎనర్జీ వెహికల్స్ (NEVs) తయారు చేయనున్నారు.

ఈ జీప్ వాహనాలను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించనున్నారు. భారత్ కూడా వీటి విక్రయాలకు అనువైన మార్కెట్‌గా మారే అవకాశం ఉంది.

అయితే, ఈ వాహనాలు పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్లుగా వస్తాయా? ప్లగ్‌ఇన్ హైబ్రిడ్ మోడళ్లుగా ఉంటాయా? లేక అదనపు విద్యుత్ పరిధిని అందించే రేంజ్ ఎక్స్‌టెండర్ టెక్నాలజీతో వస్తాయా? అనేది ఇంకా స్పష్టత లేదు.

వివరాలు 

చైనా నుంచి కార్లను తెప్పించాలని స్టెల్లాంటిస్ ఎందుకు భావిస్తోంది?

చైనా నుంచి కార్లను తయారు చేయించి భారత్‌లో విక్రయించాలన్న స్టెల్లాంటిస్ నిర్ణయం వెనుక ఆర్థిక, వ్యూహాత్మక కారణాలున్నాయి.

యూరప్‌లో అభివృద్ధి చేసిన కార్ల తయారీ ఖర్చులు ఎక్కువగా ఉండటంతో.. భారత్‌లో ముఖ్యంగా రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల ధరల విభాగంలో పోటీ పడటం కష్టమవుతోంది.

చైనాలో మాత్రం భారీ స్థాయిలో ఉత్పత్తి, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విడిభాగాల సరఫరా వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి.

అంతేకాకుండా అక్కడ కొత్త మోడళ్ల అభివృద్ధికి పట్టే సమయం కూడా తక్కువగా ఉంటుంది.

దీంతో చైనాలో తయారైన కార్లను తక్కువ ధరకు అందించే అవకాశం ఉంటుంది.

ఈ విధానం ద్వారా భారత్‌లో జీప్ కార్ల ధరలను పోటీకి అనుగుణంగా నిర్ణయించవచ్చని స్టెల్లాంటిస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

భారతీయ వినియోగదారులకు చైనా ఎస్‌యూవీలు సరిపోతాయా?

ప్రస్తుతం కార్లు కొనుగోలు చేసే చాలామంది వినియోగదారులు పెద్ద టచ్‌స్క్రీన్లు, కనెక్టెడ్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్‌గా సర్దుబాటు చేసుకునే సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), వెనుక సీట్లలో ఎక్కువ స్థలం వంటి ఫీచర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

చైనాలో తయారయ్యే ఎస్‌యూవీల్లో ఇలాంటి ఫీచర్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇవే ఫీచర్లను భారతీయ వినియోగదారులు కూడా కోరుకుంటున్నారు.

మరోవైపు, యూరప్‌లో తయారయ్యే కార్లలో డ్రైవింగ్ పనితీరు, మెటీరియల్ నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా.. భారతీయ కొనుగోలుదారులు ఆశించే కొన్ని ఫీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చు.

అందువల్ల చైనా నుంచి కార్లను తెప్పించడం ద్వారా వినియోగదారుల అభిరుచులకు తగ్గ మోడళ్లను అందించవచ్చని అంచనా.

ADVERTISEMENT

వివరాలు 

డీపీసీఏ వుహాన్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం మిగిలి ఉందా?

గత పదేళ్లలో చైనాలో డీపీసీఏ విక్రయాలు గణనీయంగా తగ్గాయి.

దీంతో వుహాన్ ప్లాంట్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తి సామర్థ్యంలో కొంత భాగం వినియోగంలో లేకుండా ఉంది.

ఈ పరిస్థితి స్టెల్లాంటిస్‌కు అనుకూలంగా మారవచ్చు. డాంగ్‌ఫెంగ్ కార్లను తయారు చేస్తే.. స్టెల్లాంటిస్ వాటికి బ్రాండింగ్, విక్రయాలు, సర్వీసింగ్ బాధ్యతలను చూసుకునే విధానం క్రమంగా కాంట్రాక్ట్ తయారీ విధానాన్ని పోలి ఉంటోంది.

ఈ విధానం భారత్‌లో సంస్థకు ప్రయోజనకరంగా ఉండవచ్చు.

ఎందుకంటే, చైనా భాగస్వామిని నేరుగా భారత వ్యాపారంలోకి తీసుకురాకుండానే అక్కడి నుంచి వాహనాల కిట్లు లేదా విడిభాగాలను తెప్పించుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

స్టెల్లాంటిస్ బీ-ఎస్‌యూవీ, పికప్ ట్రక్ ఎలా ఉండొచ్చు?

స్టెల్లాంటిస్ తీసుకురానున్న బీ-ఎస్‌యూవీ టాటామోటార్స్‌కు చెందిన ARGOS ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందే మధ్యస్థాయి ఎస్‌యూవీ అయ్యే అవకాశం ఉంది.

ఇదే ప్లాట్‌ఫామ్‌ను టాటాసియెర్రా కూడా ఉపయోగిస్తోంది.ఈకొత్త మోడల్ పెట్రోల్ లేదా ఇతర ఇంధనంతో నడిచే వెర్షన్‌తో పాటు ఎలక్ట్రిక్ రూపంలోనూ అందుబాటులోకి రావచ్చని అంచనా.

ఇక డీ-సెగ్మెంట్ పికప్ ట్రక్ విషయానికి వస్తే..జీప్ గ్లాడియేటర్‌ను భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. విడిభాగాలను పూర్తిగా విడదీసిన స్థితిలో దిగుమతి చేసుకుని(CKD కిట్లు)భారత్‌లో అసెంబుల్ చేయవచ్చు.

దీన్ని టయోటా హైలక్స్ కంటే ఎగువ ధరల విభాగంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అయితే,ఈ పికప్ ట్రక్ భారీ సంఖ్యలో అమ్మకాలు సాధించే మోడల్‌గా కాకుండా.. భారత్‌లో జీప్ బ్రాండ్ గుర్తింపును మరింత పెంచే వాహనంగా నిలిచే అవకాశముంది.

ADVERTISEMENT