
Traffic Offenders: గీత దాటారో.. లైసెన్సు గోవిందా!; ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్లు; కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా పాయింట్ల ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నారు.
ఇది రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు తొలి ప్రయత్నంగా దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు.
ఈ విధానం కింద,ఒక వాహనదారుడు ఉల్లంఘనల వల్ల మొత్తం 12 పాయింట్లు చేరితే,అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఒక సంవత్సరం పాటు రద్దు చేస్తారు.
అదే వ్యక్తి రెండు సంవత్సరాల్లో మళ్లీ 12 పాయింట్లు సాధించితే, లైసెన్స్‌ను మరో రెండేళ్ల పాటు సస్పెండ్ చేస్తారు.
ఇది మూడోసారి జరిగితే, ప్రతి సారి మూడు సంవత్సరాల పాటు లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు.
ఇక లెర్నింగ్ లైసెన్స్ కలిగిన వారి విషయంలో 5 పాయింట్లకు మించి ఉల్లంఘనలు నమోదైతే,వారి లైసెన్స్‌ను వెంటనే రద్దు చేయనున్నారు.
అనర్హత
ఐదేళ్ల వరకు అనర్హత
పదే పదే ఈ రూల్ ని ఉల్లఘించే వారిని ఐదేళ్ల వరకు అనర్హులుగా ప్రకటించవచ్చు.
ఈ వ్యవస్థ UK, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలనుండి ప్రేరణ పొందింది. ఈ వ్యవస్థను రెండు నెలల్లో చట్టంగా అమలు చేయచ్చని భావిస్తున్నారు.
గతంలో ఉల్లంఘనలు జరిగితే లైసెన్స్ పునరుద్ధరణకు తప్పనిసరి డ్రైవింగ్ పరీక్షలు, మూడు నెలల కంటే ఎక్కువ పాతది అయిన చెల్లించని ఈ-చలాన్ల లైసెన్స్‌లను సస్పెండ్ చేసే నిబంధనలు ఉన్నాయి.
ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి AI వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించాలని నిర్ణయించారు.