Loading...
GTA 6 Cars Guide: జిటిఏ 6లో మీకు నచ్చిన కారును ఇలా సొంతం చేసుకోండి
జిటిఏ 6లో మీకు నచ్చిన కారును ఇలా సొంతం చేసుకోండి

GTA 6 Cars Guide: జిటిఏ 6లో మీకు నచ్చిన కారును ఇలా సొంతం చేసుకోండి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 19, 2026
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

జిటిఏ 6లో కారు పాడైందని వెంటనే రిపేర్ షాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా ఇంజిన్‌ పరిస్థితిని తెలుసుకోవాలి. వాహనం నడుపుతున్నప్పుడు కంట్రోలర్‌లోని D-pad కింద బటన్‌ నొక్కితే మినీ మ్యాప్‌ పైన ఇంజిన్‌ స్టేటస్‌ కనిపిస్తుంది. గ్రీన్‌ రంగు అంటే కారు బాగున్నట్లు, ఆరెంజ్‌ అంటే కొంత డ్యామేజ్‌ అయినట్లు, రెడ్‌ అంటే తీవ్రంగా దెబ్బతిన్నట్లు అర్థం. రెడ్‌ క్రాస్‌ గుర్తు కనిపిస్తే ఇంజిన్‌ పూర్తిగా పాడైనట్లే.

Details

రిపేర్‌ కోసం ఎక్కడికి వెళ్లాలి?

కారు డ్యామేజ్‌ ఎక్కువగా ఉంటే Pay 'n' Spray లేదా Mod Shopకు వెళ్లి డబ్బు చెల్లించి రిపేర్‌ చేయించుకోవచ్చు.

గ్యాస్‌ స్టేషన్లలో చిన్నపాటి మరమ్మతులు మాత్రమే సాధ్యమవుతాయి. తీవ్రమైన ఇంజిన్‌ సమస్యలను అక్కడ పరిష్కరించలేరు.

సమీపంలోని రిపేర్‌ సెంటర్లను GTA 6 Indexలోని Vehicles విభాగంలో గుర్తించవచ్చు.

Details

దొంగిలించిన కార్లను అమ్ముకోవచ్చు

Pay 'n' Spray కేంద్రాల్లో సాధారణ కార్లను అమ్ముకునే అవకాశం కూడా ఉంది. గ్యారేజీలో దాచిన వాహనాలను విక్రయించాలంటే అక్కడికి వెళ్లి R1/RB బటన్‌ నొక్కి Stored Vehicles విభాగాన్ని తెరవాలి.

ఒకేసారి పలు కార్లను అమ్ముకోవచ్చు. ఖరీదైన కార్లకు మాత్రం Vehicle Fence ద్వారా మెరుగైన ధర లభించే అవకాశం ఉంది.

అయితే కారులో ఉన్న ట్రాకర్‌ రకాన్ని బట్టి కొనుగోలుదారులు అంగీకరించకపోవచ్చు. దొంగతనం చేయడానికి ముందే WAiNK యాప్‌తో స్కాన్‌ చేస్తే ట్రాకర్‌, సెక్యూరిటీ వివరాలు తెలుస్తాయి.

ADVERTISEMENT

Details

పర్సనల్‌ వెహికల్‌గా రిజిస్టర్‌ చేసుకోండి

జేసన్‌, లూసియా పేర్లపై చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసిన కార్లను Personal Vehicles అంటారు. వీటిని పోగొట్టుకున్నా లేదా ధ్వంసమైనా ScooterBros యాప్‌ ద్వారా తిరిగి గుర్తించవచ్చు.

మ్యాప్‌లో కూడా వాటి లొకేషన్‌ కనిపిస్తుంది. అంతేకాదు, కారు డిక్కీలో వస్తువులు దాచుకోవడం, దుస్తులు మార్చుకోవడం వంటి సదుపాయాలు ఉంటాయి.

అయితే కొన్ని ట్రాకర్‌ ఉన్న వాహనాలను రిజిస్టర్‌ చేసుకోవడానికి కథలో మరింత ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ADVERTISEMENT