Hero MotoCorp: మే 2024కి హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో క్షీణత
ఈ వార్తాకథనం ఏంటి
ద్విచక్ర వాహనాలలో గ్లోబల్ లీడర్ అయిన హీరో మోటోకార్ప్, మే 2024కి అమ్మకాలు 4.1% తగ్గుదల చూపింది.
మొత్తం 4.98 లక్షల యూనిట్లను విక్రయించామంది. గత ఏడాది మే నెలలో 5.19 లక్షల యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది తగ్గుదలగా నమోదైంది.
అయితే, కంపెనీ FY25 మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్-మే) 12.6% వృద్ధిని సాధించింది. గత సంవత్సరం 9.15 లక్షల యూనిట్లతో పోలిస్తే 10.31 లక్షల యూనిట్ల వరకు అమ్మకాలు జరిగాయి.
Details
ఉత్పత్తి విభజన ,దేశీయ అమ్మకాలు క్షీణత
మే 2024లో, హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ 4.71 లక్షల యూనిట్లను విక్రయించింది.
ఇది మునుపటి సంవత్సరం అమ్మకాల 4.89 లక్షల యూనిట్లతో పోలిస్తే 3.7% తగ్గింది.స్కూటర్ విభాగంలో దాదాపు 11% గణనీయమైన తగ్గుదల నమోదైంది.
గత సంవత్సరం 30,138 యూనిట్లతో పోలిస్తే కేవలం 26,937 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
దేశీయంగా, కంపెనీ అమ్మకాలు దాదాపు 5.7% క్షీణించాయి, గత సంవత్సరం 5.08 లక్షల యూనిట్ల సంఖ్యతో పోలిస్తే కేవలం 4.79 లక్షల యూనిట్లను మాత్రమే విక్రయించింది.
Details
హీరో మోటోకార్ప్ చెప్పుకోదగిన ఎగుమతి పెరుగుదల దశ
అమ్మకాలు తగ్గినా , ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల నమోదు చేసింది.కంపెనీ ఎగుమతుల్లో 67% పెరుగుదలను చూసింది.
గత ఏడాది మేలో కేవలం 11,165 యూనిట్లతో పోలిస్తే మొత్తం 18,673 యూనిట్లు ఎగుమతి చేశారు. ఈ గణాంకాలపై హీరో మోటోకార్ప్ స్పదించింది.
"హీరో మోటోకార్ప్ ఈ నెల నుండి ఎగుమతి అయిన వాటిలో మంచి వృద్ధిని నమోదు చేసింది.VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పెరిగిన డిమాండ్‌ను కొనసాగిస్తోంది.
Details
విక్రయాల తగ్గుదల , హీరో మోటోకార్ప్ భవిష్యత్తు ప్రణాళికలు
Hero MotoCorp దాని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నాణ్యంగా ఉంచడంపై దృష్టి పెట్టింది .
అధిక డిమాండ్‌కు అనుగుణంగా Xtreme 125R ఉత్పత్తిని పెంచింది. కంపెనీ అనేక ఉత్పత్తి ప్రకటనలు ,వ్యాపార విస్తరణలతో రాబోయే రోజులకి శక్తివంతంగా సిద్ధంగా వున్నామని అని పేర్కొంది.
అమ్మకాలు క్షీణించినా, సంస్థ సంబంధించిన Q4 ఫలితాలు బలంగా ఉన్నాయి..