Loading...
Honda Cars: అక్టోబర్‌లో హోండా కార్ల జోరు.. 7,609 యూనిట్ల అమ్మకాలు
అక్టోబర్‌లో హోండా కార్ల జోరు.. 7,609 యూనిట్ల అమ్మకాలు

Honda Cars: అక్టోబర్‌లో హోండా కార్ల జోరు.. 7,609 యూనిట్ల అమ్మకాలు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 03, 2026
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

పండుగల సందడి హోండా కార్ల అమ్మకాలకు మంచి ఊపునిచ్చింది. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో పెరుగుతున్న ఆదరణ కంపెనీకి కలిసొచ్చింది. 2026 అక్టోబర్‌లో హోండా కార్స్ ఇండియా దేశీయంగా 7,609 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 6,394 యూనిట్లతో పోలిస్తే ఇది దాదాపు 19 శాతం అధికం. ఎగుమతులతో కలిపి మొత్తం విక్రయాలు 8,082 యూనిట్లకు చేరాయి. ఇందులో 473 కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. పండుగ సీజన్‌లో కస్టమర్ల ఆసక్తి పెరగడం ఈ వృద్ధికి తోడ్పడింది.

Details

ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌కు కస్టమర్ల నుంచి మంచి స్పందన

అక్టోబర్ అమ్మకాల్లో హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇటీవలే అప్‌డేట్ చేసిన ఈ ఎస్‌యూవీకి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని కంపెనీ వెల్లడించింది.

కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, అప్‌డేట్ చేసిన టెక్నాలజీతో ఎలివేట్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

హోండా మార్కెటింగ్, సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ మాట్లాడుతూ.. తమ అన్ని మోడళ్లకు డిమాండ్ బాగుందని, కొత్త ఎలివేట్‌కు వినియోగదారుల నుంచి ప్రోత్సాహకర స్పందన వచ్చిందని తెలిపారు.

Details

క్రెటా, సెల్టోస్‌కు పోటీగా ఎలివేట్

భారత ఆటో మొబైల్‌ మార్కెట్లో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ తీవ్రంగా ఉంది.

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి మోడళ్లతో ఎలివేట్ పోటీపడుతోంది.

ఈ విభాగంలో ఎస్‌యూవీలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో హోండాకు ఎలివేట్ కీలక మోడల్‌గా మారింది. మొదటిసారి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచే కంపెనీ అమ్మకాలకు ఈ కారు ముఖ్యమైన బలంగా నిలిచింది.

ఫేస్‌లిఫ్ట్‌తో మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఏర్పడింది.

ADVERTISEMENT

Details

ఎగుమతుల్లో తగ్గుదల.. దేశీయ మార్కెట్‌పైనే ఆశలు

దేశీయ అమ్మకాలు పెరిగినప్పటికీ ఎగుమతుల విషయంలో హోండాకు ఈసారి తగ్గుదల కనిపించింది. 2025 అక్టోబర్‌లో 4,124 యూనిట్లు ఎగుమతి చేయగా, 2026 అక్టోబర్‌లో ఆ సంఖ్య 473కు పరిమితమైంది.

దీంతో మొత్తం విక్రయాల్లో దేశీయ మార్కెట్ వాటా కీలకంగా నిలిచింది.

ఇక రానున్న నెలల్లో ఎలివేట్ డిమాండ్‌ను కొనసాగించడంతో పాటు సిటీ, అమేజ్ మోడళ్ల అమ్మకాలను కూడా నిలబెట్టుకోవడం హోండాకు ముఖ్యం.

పండుగ సీజన్‌లో వచ్చిన ఈ ఊపు 2027 ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలోనూ కొనసాగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT