Page Loader
HONDA CBR 650R: హోండా CBR650R E-క్లచ్ వచ్చేసింది.. ఇక గేర్ మార్పులకు క్లచ్ అవసరం లేదు!
హోండా CBR650R E-క్లచ్ వచ్చేసింది.. ఇక గేర్ మార్పులకు క్లచ్ అవసరం లేదు!

HONDA CBR 650R: హోండా CBR650R E-క్లచ్ వచ్చేసింది.. ఇక గేర్ మార్పులకు క్లచ్ అవసరం లేదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మీరు శక్తివంతమైన మిడ్-సెగ్మెంట్ స్పోర్ట్స్ బైక్ కోసం వెతుకుతున్నట్లయితే హోండా CBR650R E-క్లచ్ మీకు సరైన ఎంపిక కావొచ్చు. ఇటీవల ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మే నెలలో లాంచ్‌ చేసిన ఈ మిడ్-వెయిట్ స్పోర్ట్స్ టూరర్‌ను హోండా బిగ్ వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.40 లక్షలు.

Details

శక్తివంతమైన ఇంజిన్ స్పెసిఫికేషన్స్

ఈ బైక్‌లో 649cc లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 94 bhp పవర్, 63 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు స్లిప్, అసిస్ట్ క్లచ్ జతచేశారు. E-క్లచ్ వేరియంట్‌ను ఎంచుకుంటే అదనంగా రూ. 40,000 చెల్లించాల్సి ఉంటుంది. బ్రేకింగ్, ABS, టెక్నాలజీ హోండా CBR650R E-క్లచ్ ముందుభాగంలో 310mm డ్యూయల్ ఫ్లోటింగ్ డిస్క్, వెనుక 240mm సింగిల్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంది. దీనిలో డ్యూయల్ ఛానెల్ ABS సదుపాయం ఉంటుంది. అలాగే 5-అంగుళాల TFT డిజిటల్ డిస్ప్లే అందిస్తుంది. ఇందులో హోండా రోడ్‌సింక్ యాప్ ముందే ఇన్‌స్టాల్‌ చేసి ఉంటుంది. దీని ద్వారా కాల్, మెసేజ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి ఉపయోగించుకోవచ్చు.

Details

E-క్లచ్ టెక్నాలజీ - ఎలా పనిచేస్తుంది?

సుమారు 2 కిలోల బరువు కలిగిన ఈ సాంకేతికత యాక్యుయేటర్లు, మల్టిపుల్ సెన్సార్లు ఉపయోగించి క్లచ్ ఎంగేజ్‌మెంట్‌ను ఎలక్ట్రానిక్‌గా నిర్వహిస్తుంది. ఇది రైడర్‌ను క్లచ్ లివర్ వాడకుండా గేర్ మార్పులు చేయనివ్వడంతో పాటు, ట్రాఫిక్‌లో బైక్ స్టాల్ కాకుండా చూడుతుంది. అయితే, రైడర్‌కు కావాలంటే సంపూర్ణంగా పనిచేసే క్లచ్ లివర్ వాడుకునే అవకాశమూ ఉంటుంది. మొత్తానికి, మిడ్-సెగ్మెంట్‌లో అధునాతన ఫీచర్లతో వస్తున్న హోండా CBR650R E-క్లచ్ స్పోర్ట్స్ బైక్‌ను టెక్నాలజీ ప్రేమికులు తప్పక పరిశీలించవచ్చు.