
Honda PCX 160 : యమహా, అప్రిలియాలకు పోటీ ఇవ్వనున్న హోండా PCX 160.. .. స్టైలిష్ డిజైన్, పవర్‌పుల్ ఇంజిన్‌తో అదుర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? అప్పుడు మీ కోసం హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) నుంచి సరికొత్త ప్రీమియం స్కూటర్ రానుంది.
దేశంలో రెండవ అతిపెద్ద టూవీలర్ తయారీదారిగా ఉన్న హోండా, స్కూటర్లు, బైకుల విస్తృత శ్రేణితో వినియోగదారులకు ఎన్నో ఎంపికలను అందిస్తోంది.
ప్రస్తుతం భారత టూవీలర్ మార్కెట్ ప్రీమియం వాహనాలవైపు మలుపు తిరుగుతోంది. దీనితో OEM కంపెనీలు మరింత అధునాతన మోడళ్ల అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నాయి.
ఈ మారుతున్న ధోరణిలో భాగంగా, హోండా కూడా తన 'బిగ్ వింగ్' శ్రేణిలో ప్రీమియం టూవీలర్లను రూపొందించేందుకు అడుగులు వేస్తోంది.
ముఖ్యంగా బైకుల తయారీపై దృష్టి పెట్టిన జపనీస్ ఆటో దిగ్గజం, ఇప్పుడు ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
Details
భారత మార్కెట్‌కు హోండా PCX 160!
హోండా తాజాగా భారత మార్కెట్‌లో PCX 160 స్కూటర్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. ఈ స్కూటర్, యమహా ఏరోక్స్, అప్రిలియా SXR 160, అలాగే ఇటీవలే విడుదలైన హీరో జూమ్ 160(Hero Xoom 160)తో గట్టి పోటీ ఇవ్వనుంది.
డిజైన్ లక్షణాలు
PCX 160 స్కూటర్, ట్రెడిషనల్ ఫ్లాట్ ఫుట్‌బోర్డ్ బదులుగా మ్యాక్సీ-స్టైల్ డిజైన్‌తో ప్రత్యేకతను సంతరించుకుంటుంది.
ముందు భాగంలో బిగ్ ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్, V-ఆకారంలో డే టైమ్ రన్నింగ్ లైట్స్, అడ్జస్ట్ చేయగల లాంగ్ విండ్‌స్క్రీన్ వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.
పిలియన్ కోసం స్టెప్-అప్ సీటింగ్ సెటప్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్,అల్లాయ్ వీల్స్, సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ లాంటి అంశాలు ఈస్కూటర్‌కు స్టైలిష్ లుక్ ఇస్తాయి.
Details
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
హోండా PCX 160 స్కూటర్‌లో పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కీలెస్ ఇగ్నిషన్, వైడ్ అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశముంది.
అదనంగా, పేటెంట్ ఇమేజ్ ప్రకారం అడ్జస్ట్ చేయగల క్లచ్ మరియు బ్రేక్ లివర్లు కూడా ఉండొచ్చని ఊహిస్తున్నారు.
హార్డ్‌వేర్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ అండర్‌బోన్ ఫ్రేమ్, ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, రియర్ ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంటుంది.
14 అంగుళాల ఫ్రంట్, 13 అంగుళాల రియర్ అల్లాయ్ వీల్స్‌తో వస్తోంది. రెండు చక్రాలకూ డిస్క్ బ్రేక్‌లు మరియు డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ అందించనున్నారు.
Details
పవర్‌ఫుల్ ఇంజిన్
PCX 160కు 157cc సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఇది 8,500rpm వద్ద 15.8bhp పవర్, 6,500rpm వద్ద 14.7Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.
వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (CVT) ద్వారా స్కూటర్‌కు మృదువైన రైడింగ్ అనుభవాన్ని అందించేలా రూపొందించనున్నారు.
ఇంత స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్‌తో హోండా PCX 160 స్కూటర్, ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో ఓ బెంచ్‌మార్క్ కావడమే కాకుండా, హోండా అభిమానులను ఆకట్టుకునే అవకాశముంది.