Honda:హోండా నుంచి 10 కొత్త బైక్‌లు, స్కూటర్లు.. త్వరలో దశలవారీగా లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారీ అడుగు వేసింది. సంస్థ ఏకంగా 10 కొత్త టూవీలర్లను ఆవిష్కరించింది. వీటిలో ఏడు పూర్తిగా కొత్త మోడళ్లు కాగా, మరో మూడు బైక్‌లను కొత్త రంగులతో రిఫ్రెష్ చేసింది. స్కూటర్లు, రోడ్‌స్టర్లు, క్రూయిజర్లు, అడ్వెంచర్ బైక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ వంటి విభిన్న విభాగాలను ఈ కొత్త లైనప్‌లో హోండా పరిచయం చేసింది. ఇటీవల కాలంలో సంస్థ చేపట్టిన అతిపెద్ద పోర్ట్‌ఫోలియో విస్తరణగా దీనిని భావిస్తున్నారు.
వివరాలు
85 ఇంధనానికి మద్దతు ఇచ్చే భారతదేశపు తొలి స్కూటర్‌గా ADV 160
ఈ లైనప్‌లో భారత వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించే మోడల్‌గా హోండా ADV 160 నిలిచే అవకాశం ఉంది.
నగర ప్రయాణాలకు అనువుగా ఉండే అడ్వెంచర్ స్కూటర్‌గా దీన్ని రూపొందించారు.
160 సీసీ వాటర్ కూల్డ్ ఇంజిన్, 27 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, 8.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇందులో ఉన్నాయి.
ముఖ్యంగా E85 ఇంధనానికి మద్దతు ఇచ్చే భారతదేశపు తొలి స్కూటర్‌గా ADV 160 నిలుస్తుందని హోండా తెలిపింది.
ప్రీమియం రోడ్‌స్టర్ విభాగంలో హోండా CB 500ను తీసుకొచ్చింది. క్లాసిక్ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లను కలిపిన ఈ బైక్‌లో 501 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌కు ఆయిల్ కూలింగ్ సిస్టమ్‌ను జత చేశారు.
వివరాలు
స్టాండర్డ్, ఈ-క్లచ్ రెండు వేరియంట్లు
అలాయ్, స్పోక్ ట్యూబ్‌లెస్, గ్రాఫిక్స్‌తో కూడిన స్పోక్ ట్యూబ్‌లెస్ అనే మూడు వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది.
క్రూయిజర్ బైక్‌లను ఇష్టపడే వారి కోసం రెబల్ 300ను హోండా పరిచయం చేసింది.
బాబర్ స్టైల్ డిజైన్, తక్కువ ఎత్తు సీటు, మినిమలిస్టిక్ లుక్‌తో రూపొందించిన ఈ బైక్‌లో 286 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది.
స్టాండర్డ్, ఈ-క్లచ్ అనే రెండు వేరియంట్లలో ఇది మార్కెట్‌లోకి రానుంది.
ఇదే డిజైన్‌ను మరింత శక్తివంతమైన 471 సీసీ ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో రెబల్ 500లో కూడా అందించారు.
అడ్వెంచర్,ఆఫ్‌రోడ్ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని XR 300L మరియు XR 300 ర్యాలీ మోడళ్లను కూడా హోండా పరిచయం చేసింది.
వివరాలు
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో హోండా QC3 అనే కొత్త ఈవీ స్కూటర్
XR 300Lలో 293.5సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పాటు ఆయిల్ కూలింగ్,లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉన్నాయి.
మరోవైపు XR 300ర్యాలీ ట్రైల్ టూరింగ్,మిశ్రమ రోడ్లపై సుదీర్ఘ ప్రయాణాలకు అనువుగా ర్యాలీ స్టైల్ డిజైన్‌తో రూపొందించారు.
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో హోండా QC3 అనే కొత్త ఈవీ స్కూటర్‌ను ఆవిష్కరించింది.
కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ స్కూటర్‌లో 3 కిలోవాట్ గంటల బ్యాటరీ,ఒకసారి ఛార్జ్ చేస్తే 151కిలోమీటర్ల IDC రేంజ్,32లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉన్నాయి.
అలాగే CB350,CB350C,CB350RS మోడళ్లను కొత్త రంగులతో రిఫ్రెష్ చేసింది.
ఈ కొత్త వాహనాలన్నింటినీ దశలవారీగా భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు హోండా ప్రకటించింది.
ధరలు,విడుదల తేదీలను ఆయా మోడళ్ల విడుదలకు ముందు ప్రకటించనున్నట్లు హోండా తెలిపింది.