Honda ZR-V: భారత్‌లో అడుగుపెట్టిన హోండా ZR-V.. హైబ్రిడ్ ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు..
ఈ వార్తాకథనం ఏంటి
హోండా కార్స్ ఇండియా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన హోండా ZR-Vను భారత మార్కెట్‌లో అధికారికంగా పరిచయం చేసింది. సిటీ ఫేస్‌లిఫ్ట్‌తో పాటు ఈ ఎస్‌యూవీని కంపెనీ ఆవిష్కరించింది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే CBU మోడల్‌గా ఈ కారు భారత్‌లో పరిమిత సంఖ్యలో విక్రయించనున్నారు. ధర,అధికారిక లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే 2026 జూలై నుంచి డెలివరీలు ప్రారంభం కానుండగా,ఆసక్తి ఉన్న కస్టమర్లు ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. డిజైన్ పరంగా హోండా ZR-Vకు స్పోర్టీ, ప్రీమియం లుక్ ఇచ్చారు. ఈ సెగ్మెంట్‌లో కనిపించే బాక్సీ డిజైన్‌కు భిన్నంగా రౌండెడ్ స్టైల్‌లో రూపొందించారు.
వివరాలు .
బంపర్ రెండు వైపులా ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్
ముందుభాగంలో ఎల్-షేప్ DRLsతో కూడిన స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్, బ్లాక్ వెర్టికల్ స్లాట్ గ్రిల్ ఆకట్టుకుంటాయి. బంపర్ రెండు వైపులా ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్, దిగువ భాగంలో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో 18 అంగుళాల అలాయ్ వీల్స్, పెద్ద వీల్ ఆర్చ్‌లు స్పోర్టీ ఫీల్ ఇస్తాయి. వెనుక భాగంలో కూడా షార్ప్ డిజైన్ టెయిల్ ల్యాంప్స్, బ్లాక్ బంపర్, రెండు వైపుల ఎగ్జాస్ట్ అవుట్‌లెట్స్‌తో పాటు సిల్వర్ ట్రిమ్ ఇచ్చారు. రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, రియర్ వైపర్ కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ పొడవు 4,576 మిల్లీమీటర్లు, వెడల్పు 1,840 మిల్లీమీటర్లు, ఎత్తు 1,621 మిల్లీమీటర్లు.
వివరాలు
హోండా ZR-V ప్రీమియం ఫీచర్స్
ఇంటీరియర్ విషయంలో హోండా ZR-V ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇందులో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఇచ్చారు. అలాగే 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 12 స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లెదరెట్ సీట్లు,ముందు-వెనుక ఆర్మ్‌రెస్టులు,8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 4-వే కో-డ్రైవర్ సీట్, పవర్డ్ టెయిల్‌గేట్,అంబియెంట్ లైటింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. గేర్ సెలెక్టర్‌కు ఫిజికల్ బటన్ సెటప్ ఇచ్చారు.సేఫ్టీ కోసం 8 ఎయిర్‌బ్యాగ్స్,లెవెల్-2 ADAS,TPMS, 360 డిగ్రీ కెమెరా వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు అందించారు.
వివరాలు
8 సెకన్లలోనే 0 నుంచి 100 కీ.మీ వేగం
పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. భారత్‌కు వచ్చిన హోండా ZR-Vలో 2.0 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డ్యూయల్ మోటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను జత చేశారు. ఈ సెటప్ మొత్తం 184 హెచ్‌పీ పవర్, 315 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి e-CVT గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ SUV కేవలం 8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ తెలిపింది. గరిష్ట వేగం గంటకు 172 కిలోమీటర్లు. ఇక మైలేజ్ పరంగా లీటరుకు 22.79 కిలోమీటర్లు ఇస్తుందని హోండా పేర్కొంది.