Husqvarna Svartpilen 401 v/s BMW G 310 R: ఈ రెండు బైకుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
స్వీడన్ దేశానికి చెందిన హాస్క్ వర్ణా, స్వార్ట్ పైలెన్ 401 అనే కొత్త బైకును ఇండియాలో లాంచ్ చేయబోతుంది. 373క్యూబిక్ కెపాసిటీ సామర్థ్యం గల ఈ బైకు, ఇండియాలో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న BMW G 310 Rకు పోటీగా నిలవబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బైకుల విశేషాలేంటో తెలుసుకుని ఏ బైక్ అయితే మీకు సూట్ అవుతుందో తెలుసుకుందాం. స్వార్ట్ పైలెన్ 401 చాలా స్టైలిష్ గా ఉంది: ఎల్ఈడీ సెటప్ లైటింగ్ తో ఉండే ఈ బైక్, రెండు చక్రాలకు 27అంగుళాల స్పోక్స్ ని కలిగి ఉంది. పెట్రోల్ ట్యాంక్ ఎత్తుగా ఉండకుండా సీటుకు సమాంతరంగా ఉండి సరికొత్త లుక్ ఇస్తుంది.
క్యూబిక్ కెపాసిటీ ఎక్కువగా ఉండే స్వార్ట్ పైలెన్ 401
BMW G 310 R బైక్ పెట్రోల్ ట్యాంక్ కొంచెం ఎత్తుగా ఉంది. డిజిటల్ స్పీడోమీటర్, ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రైడర్ సీటు కంటే వెనకాల సీటు ఇంకొంచెం ఎత్తుగా ఉంటుంది. G 310 R గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది: హాస్క్ వర్ణా స్వార్ట్ పైలెన్ 401 గ్రౌండ్ క్లియరెన్స్ 145mm ఉంటే, G 310 R మాత్రం 165mmఉంటుంది. స్వార్ట్ పైలెన్ 401లో 9.5లీటర్ల ఇంధన సామర్థ్యం ఉంటే, G 310 R లో 11లీటర్ల సామర్థ్యం ఉంది. క్యూబిక్ కెపాసిటీ: ముందే చెప్పినట్టు స్వార్ట్ పైలెన్ 401క్యూబిక్ కెపాసిటీ 373సీసీ గా ఉంది. G 310 R మాత్రం 313సీసీగా ఉంది.
ధరల్లో పోలికలు
స్వార్ట్ పైలెన్ 401 ఇంజన్ పవర్ 43హెచ్ పీ గా ఉంటే, బీ ఎమ్ డబ్ల్యూ మాత్రం 33.5హెచ్ పీ ఉంది. ఈ రెండు వాహనాలకు 6గేర్లు ఉన్నాయి. ఈ రెండు బైకులకు రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్ ఉంది. ఇక ధర విషయానికి వస్తే, స్వార్ట్ పైలెన్ 401 ధర, 3లక్షలు (ఎక్స్ షో రూమ్) గా ఉంది. BMW G 310 R ధర 2.8లక్షలు (ఎక్స్ షో రూమ్) ఉంది.