2024 బెనెల్లీ TNT 500 వర్సెస్ 2024 కవాసకి Z500.. ఏది బెటర్ అంటే?
ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ బెనల్లీ ఇటీవల టీఎన్‌టీ 500 బైక్ ను ఆవిష్కరించింది. ఈ బైక్ 500cc స్ట్రీట్ ఫైటర్ సెగ్మెంట్‌లో అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బైక్‌కి పోటీగా మార్కెట్లోకి కవాసకి Z500 వచ్చింది. ఇది 451సీసీ ఇంజిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు బైకుల్లో బెటర్ ఆప్షన్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. కవాసకి Z500కంటే బెనెల్లీ టీఎన్టీ 500 లుక్ ఆకర్షణీయంగా ఉంది. ఈ రెండింట్లో మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, విస్తృత హ్యాండిల్ బార్, స్ప్లిట్-టైప్ సీట్లు, సైడ్-స్లంగ్ ఎగ్జాస్ట్, LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్‌లైట్ ఉన్నాయి. రెండు బైక్‌లు 17-అంగుళాల డిజైనర్ వీల్స్‌పై నడుస్తాయి.
బెనెల్లీ TNT 500లో అత్యాధునిక ఫీచర్లు
రైడర్ భద్రత కోసం ఈ రెండు బైకుల్లో డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రైడ్-బై-వైర్ థొరెటల్‌ను కలిగి ఉంటాయి. కవాసకి Z500లో ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉండగా, ఇది 45hp గరిష్ట శక్తిని, 43Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. బెనెల్లీ TNT 500లో లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-టూ-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 47.6hp శక్తిని, 46Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. 2024 బెనెల్లీ TNT 500, 2024 కవాసకి Z500 రెండింటి ధరలను ఇంకా అధికారంగా వెల్లడించలేదు. కవాసకి Z500 కంటే బెనెల్లీ TNT 500 డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌తో అమర్చారు.