Loading...
Kawasaki Z650RS MY27: కొత్త కలర్‌లో కవాసకి Z650RS.. ధర తెలిస్తే షాకే
కొత్త కలర్‌లో కవాసకి Z650RS.. ధర తెలిస్తే షాకే

Kawasaki Z650RS MY27: కొత్త కలర్‌లో కవాసకి Z650RS.. ధర తెలిస్తే షాకే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 09, 2026
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెట్రో లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే బైక్ ప్రియుల కోసం కవాసకి మరో అప్‌డేట్ తీసుకొచ్చింది. తన Z650RS MY27 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.7.83 లక్షలుగా నిర్ణయించింది. 2026 సెప్టెంబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ బైక్‌లో కొత్త మెటాలిక్ కార్బన్ గ్రే కలర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అయితే రంగు మార్పు మినహా ఇంజిన్, ఇతర కీలక మెకానికల్ అంశాల్లో పాత మోడల్‌నే కొనసాగించింది.

Details

పాతకాలపు లుక్.. ఆధునిక టెక్నాలజీ

కవాసకి Z650RS డిజైన్‌లో క్లాసిక్ మోటార్‌సైకిళ్ల ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి.

గుండ్రటి LED హెడ్‌ల్యాంప్, ఆకర్షణీయమైన ఫ్యూయల్ ట్యాంక్, ఫ్లాట్ రియర్ డిజైన్, LED టెయిల్ ల్యాంప్ ప్రత్యేకతలు.

వైర్-స్పోక్ వీల్స్‌లా కనిపించే అల్లాయ్ వీల్స్ దీనికి ప్రత్యేక రూపాన్ని ఇస్తాయి. స్పీడోమీటర్, టాకోమీటర్‌తో కూడిన రెండు అనలాగ్ మీటర్లకు అదనంగా మల్టీ ఫంక్షన్ LCD స్క్రీన్ కూడా ఉంది.

Details

649 సీసీ ఇంజిన్.. 68 PS పవర్

ఈ బైక్‌లో 649 సీసీ లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇది 8,000 rpm వద్ద 68 PS పవర్, 6,700 rpm వద్ద 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆరు గేర్ల గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ అందించారు. రెండు మోడ్‌ల కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది.

స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్‌పై రూపొందించిన ఈ బైక్‌లో ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక హారిజాంటల్ బ్యాక్-లింక్ సస్పెన్షన్ ఉన్నాయి.

ముందు 300 మి.మీ. డ్యూయల్ డిస్కులు, వెనుక 220 మి.మీ. డిస్క్ బ్రేక్ అమర్చారు. 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 192 కిలోల కెర్బ్ వెయిట్ ఉన్నాయి.

ADVERTISEMENT