Range Rover: భారత్‌లో తొలి Made in India రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV లాంచ్
రేంజ్ రోవర్ తన తొలి 'Made in India' రేంజ్ రోవర్ స్పోర్ట్ SUVను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2025 మోడల్‌ను విడుదల చేసిన ఈ లగ్జరీ SUVలో రెండు పవర్‌ట్రైన్ ఆప్షన్‌లను అందిస్తున్నారు. కొత్త ఫీచర్లు, ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లతో సాగే ఈ కారును రూ. 1.45 కోట్ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విక్రయించనున్నారు. ఇది గత మోడల్‌తో పోలిస్తే రూ. 5 లక్షల పెరుగుదలని సూచిస్తుంది. 2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ రెండు ఇంజిన్ ఆప్షన్‌లతో రానుంది. 3.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ డీజిల్ - టాప్-స్పెక్ డైనమిక్ HSE వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో పలు ఆధునిక ఫీచర్లు, ప్రత్యేక ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లు కూడా ఉన్నాయి.
మెరుగైన ఫీచర్లతో సౌకర్యవంతమైన ప్రయాణం
ఫూజీ వైట్, సెంతోరిణి బ్లాక్, జియోలా గ్రీన్, వెరసిన్ బ్లూ, చారెంట్ గ్రే వంటి కలర్లలో రానుంది. ఈ SUVలో సాంకేతికంగా సమర్థవంతమైన ఫీచర్లు ఉన్నాయి. వాటిలో 13.1-అంగుళాల పివి ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 13.7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హెడ్ అప్ డిస్‌ప్లే, డైనమిక్ ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్-రోడ్ క్రూజ్ కంట్రోల్, డిజిటల్ LED హెడ్లాంప్‌లు ఉన్నాయి. సెమీ అనిలిన్ లెదర్ సీట్లు, మసాజ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి.
కస్టమర్లకు ప్రత్యేకమైన అనుభూతి
ఈ కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ SUVతో, JLR ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా మాట్లాడారు. ఈ వాహనం కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తుందని, అధునాతన సాంకేతికత, డైనమిక్ పనితీరు, ప్రత్యేక ఫీచర్లతో కస్టమర్లకు అద్భుతమైన అనుభవం అందిస్తామని పేర్కొన్నారు. 'Made in India' రేంజ్ రోవర్ స్పోర్ట్, బ్రాండ్ ప్రతిష్టను మరింత బలపరిచేలా కనిపిస్తోంది.